ఇండోర్: బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరిస్ ముగిసింది. నవంబర్ 14 నుంచి ఇరు జట్ల మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అనంతరం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నవంబర్ 22 నుంచి 26 వరకు భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి డే/నైట్ టెస్టు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ మ్యాచ్‌లో వినియోగించే పింక్ బాల్స్ భారత ఆటగాళ్ల వద్దకు చేరుకున్నాయి. ప్రముఖ సోర్ట్స్ కిట్స్ తయారీ సంస్థ 'ఎస్జీ' పింక్ బాల్స్‌ను తయారు చేసింది.
వన్డే ర్యాంకింగ్స్.. టాప్‌లోనే కోహ్లీ, బుమ్రా
తాజాగా పింక్ బాల్స్ ఇండోర్ చేరుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇండోర్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇక్కడే ఈ పింక్ బాల్స్‌ని ఆవిష్కరించారు. జట్టు సిబ్బంది ఒకరు పింక్ బాల్స్ బాక్సును ఓపెన్ చేసి చూపించారు. ఇక మంగళవారం నుండే ఈ బంతులతో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు. భారత ఆటగాళ్లతో పాటు బంగ్లాదేశ్ ఆటగాళ్లు పింక్ బంతులతో ప్రాక్టీస్ చేస్తారట.
మరోవైపు.. డే/నైట్ టెస్టు నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను ప్లడ్ లైట్ల కింద నిర్వహించాలని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపిసిఎ)ను టీమిండియా మేనేజ్మెంట్ అభ్యర్ధించింది. డే/నైట్ టెస్టుకు ప్రాక్టీస్‌గా ఉంటుందని తొలి టెస్టుకి ముందే టీమిండియా ప్లడ్ లైట్ల కింద ప్రాక్టీస్ చేయాలని భావిస్తోంది.
Looks who's here - unboxing the Pink cherry 😃😃#TeamIndia had a stint with the Pink Ball at the nets today in Indore #INDvBAN 👀👀 pic.twitter.com/JhAJT9p6CI
— BCCI (@BCCI) 12 November 2019
ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మిలింద్ కన్మాడికర్ ఓ ప్రకటనలో తెలిపారు. మిలింద్ మాట్లాడుతూ... 'భారత జట్టు నుంచి మాకొక రిక్వెస్ట్ వచ్చింది. పింక్ బాల్ టెస్టు జరగనున్న నేపథ్యంలో ప్లడ్ లైట్ల కింద ప్రాక్టీస్ చేయాలని. కాబట్టి మేము ఆ దిశగా ఏర్పాట్లు చేయబోతున్నాం' అని తెలిపారు.
బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజ్యంకే రహానే మాట్లాడుతూ పింక్ బాల్ టెస్టు ఛాలెంజ్‌లను స్వీకరించాలంటే అందుకు తగ్గట్లుగా శిక్షణ పొందాలని తెలిపాడు. 'నేను వ్యక్తిగతంగా చాలా సంతోషిస్తున్నాను. ఇది కొత్త సవాల్. బంతి ఎలా మారుతుందో నాకు తెలియదు, కానీ.. ప్రాక్టీస్ సెషన్లలో ఆడితే మనకొక ఆలోచన వస్తుంది' అని అన్నాడు.