న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Test rankings: కెరీర్ బెస్ట్ టెస్ట్ ర్యాంకులో షమీ.. మూడో పేస్ బౌలర్‌గా రికార్డు!!

ICC Test Rankings : Mohammed Shami Breaks Into Top 10 || Oneindia Telugu
India vs Bangladesh: Mohammed Shami reaches career-best position on ICC Test rankings for bowlers

దుబాయ్: ఇండోర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. పేసర్‌ మొహమ్మద్‌ షమీ మరోసారి రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో అతను మొత్తం 7 వికెట్లు తీశాడు. షమీ తొలి ఇన్నింగ్స్‌లో 3/27, రెండో ఇన్నింగ్స్‌లో 4/31 గణాంకాలు నమోదు చేశాడు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ టెస్టు సిరీస్‌ విజయాల్లో షమీ ముఖ్యపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

<strong>Ishant asks shami: నీలాగే బౌలింగ్‌ చేస్తున్నా వికెట్లు దక్కడం లేదు.. ఇంతకీ నీ రహస్యమేంటో చెప్పు!!</strong>Ishant asks shami: నీలాగే బౌలింగ్‌ చేస్తున్నా వికెట్లు దక్కడం లేదు.. ఇంతకీ నీ రహస్యమేంటో చెప్పు!!

కెరీర్ బెస్ట్ టెస్ట్ ర్యాంకులో షమీ

గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న షమీ.. తాజాగా ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్టు ర్యాంకుకు చేరుకున్నాడు. ఆదివారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో షమీ 8మిది స్థానాలు ఎగబాకి టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. టెస్టుల్లో 790 రేటింగ్‌ పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. ఇక అత్యధిక రేటింగ్ పాయింట్లు ఉన్న భారత మూడో పేస్ బౌలర్‌గా షమీ రికార్డుల్లోకి ఎక్కాడు. కపిల్ దేవ్ (877), జస్‌ప్రీత్ బుమ్రా (832) మాత్రమే షమీ కంటే ఎక్కువ పాయింట్లు కలిగి ఉన్నారు.

 నాలుగో ర్యాంకులో బుమ్రా

నాలుగో ర్యాంకులో బుమ్రా

బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రబడ, హోల్డర్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. యువ స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్ బుమ్రా 802 పాయింట్లతో నాలుగో ర్యాంకులో కొనసాగుతుండగా.. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 780 రేటింగ్స్‌తో పదో స్థానంలో ఉన్నాడు.

నంబర్‌ వన్‌లో స్మిత్‌

నంబర్‌ వన్‌లో స్మిత్‌

టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ నంబర్‌ వన్‌లో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రెండో ర్యాంకులో కొనసాగుతున్నాడు. విల్లియంసన్, పుజారా, రహానే తర్వాతి స్థానాల్లో ఉన్నారు. డబుల్ సెంచరి హీరో మయాంక్ అగర్వాల్ 11వ స్థానానికి చేరుకున్నాడు. 28 ఏళ్ల మయాంక్ మొదటి ఎనిమిది టెస్టుల్లో 858 పరుగులు చేసి 691 రేటింగ్ పాయింట్లు సంపాదించాడు.

 జడేజా@2

జడేజా@2

ఆల్‌రౌండర్‌ల జాబితాలో జాసన్ హోల్డర్ అగ్ర స్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానానికి తిరిగి చేరుకున్నాడు. జట్టు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్‌ వన్‌లో ఉంది. న్యూజీలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టాప్-5లో ఉన్నాయి.

Story first published: Sunday, November 17, 2019, 16:46 [IST]
Other articles published on Nov 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X