Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షమీ 'హ్యాట్రిక్‌' మిస్.. ఇషాంత్‌, షమీ కంబైన్డ్‌ హ్యాట్రిక్‌!!

India vs Bangladesh: Mohammed Shami, Ishant Sharma combine to take team hat-trick

ఇండోర్‌: ఇండోర్‌ హోల్కర్ స్టేడియంలో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత పేస్‌ త్రయం ధాటికి బంగ్లాదేశ్‌ తొలి రోజే చాప చుట్టేసింది. ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌ ఆరంభంలోనే ప్రత్యర్థి పతనానికి బాటలు వేయగా.. ఆ తర్వాత రివర్స్‌ స్వింగ్‌తో పేసర్‌ మహ్మద్‌ షమీ బెంబేలెత్తించాడు. షమీ (3/27), ఇషాంత్ (2/20), ఉమేశ్ (2/47) నిప్పులు చెరగడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది.

కంబైన్డ్‌ హ్యాట్రిక్‌

కంబైన్డ్‌ హ్యాట్రిక్‌

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో షమీ హ్యాట్రిక్‌ తీసే అవకాశాన్ని కోల్పోయాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో భాగంగా 54 ఓవర్‌ ఐదో బంతికి ముష్ఫికర్‌ రహీమ్‌ వికెట్‌ తీసిన షమీ.. ఆ మరుసటి బంతికి మెహిదీ హసన్‌ ఔట్ చేసాడు. అనంతరం టీ బ్రేక్‌ రాగా.. షమీని హ్యాట్రిక్‌ ఊరించింది. మూడో సెషన్ తొలి బంతికే ఇషాంత్ మరో వికెట్ తీశాడు. 55 ఓవర్‌ మొదటి బంతికే లిటాన్‌ దాస్‌ ఔటయ్యాడు. దాంతో షమీ, ఇషాంత్‌లు సంయుక్తంగా టీమ్‌ హ్యాట్రిక్‌ను నమోదు చేశారు.

షమీ హ్యాట్రిక్‌ మిస్

షమీ హ్యాట్రిక్‌ మిస్

బంగ్లాదేశ్‌ స్కోరు 140 పరుగుల వద్ద ఉండగా వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో కంబైన్డ్‌ హ్యాట్రిక్‌గా నమోదైంది. ఇక షమీ వేసిన 56వ ఓవర్‌లో అతని వ్యక్తిగత హ్యాట్రిక్‌ సాధిస్తాడేమోనని ఎదురుచూసినా.. అది సాధ్యం కాలేదు. తైజుల్‌ ఇస్లామ్‌ విజయవంతంగా బంతిని డిఫెండ్‌ చేశాడు. అయితే సంయుక్తంగా హ్యాట్రిక్‌ రావడమే భారత పేస్‌ బౌలింగ్‌ ధాటిగా అద్దం పడుతోంది.

 పుజారా అర్ధ సెంచరీ

పుజారా అర్ధ సెంచరీ

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన భారత జట్టు ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్‌ శర్మ (6) వికెట్‌ను కోల్పోయింది. పేసర్ అబు జాయేద్‌ బౌలింగ్‌లో రోహిత్‌ పెవిలియన్ చ్చేరాదు. అయితే మరో ఓపెనర్ అమాయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా జట్టును ఆడుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. రెండో రోజు పుజారా అర్ధ సెంచరీ చేసాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా (54), మయాంక్ (44) ఉన్నారు.

Story first published: Friday, November 15, 2019, 10:19 [IST]
Other articles published on Nov 15, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+