న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డబుల్ సెంచరీ ఎఫెక్ట్: జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మయాంక్ చమత్కార సమాధానం

IND vs BAN,1st Test : Mayank Agarwal’s Witty Reply To A Question From Journalist || Oneindia Telugu
India vs Bangladesh: Mayank Agarwal’s witty reply to a question from journalist leaves everyone in splits

హైదరాబాద్: ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(243) డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో తొలి టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. 12 ఇన్నింగ్స్‌ల్లోనే మయాంక్ రెండు డబుల్ సెంచరీలు సాధించి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే, డబుల్ సెంచరీ అనంతరం ట్రిపుల్ సెంచరీ చేయాలన్న కసితో దూకుడుగా ఆడే క్రమంలో యమాంక్ అగర్వాల్ 243 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. మెహదీ హసన్‌ బౌలింగ్‌లో జయేద్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది.

IPL 2020: సన్‌రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరే!, పర్స్‌లో మిగిలిన నగదు ఇదేIPL 2020: సన్‌రైజర్స్ విడుదల చేసిన ఆటగాళ్లు వీరే!, పర్స్‌లో మిగిలిన నగదు ఇదే

343 పరుగుల ఆధిక్యం

343 పరుగుల ఆధిక్యం

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 343 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 37 పరుగులతో రెండో రోజు ఆటను కొనసాగించిన మయాంక్ అగర్వాల్ (243; 330 బంతుల్లో 28 పోర్లు, 8 సిక్సలు)తో డబుల్ సెంచరీని సాధించాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌కు ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం.

భయాన్ని పోగొట్టుకున్నా

భయాన్ని పోగొట్టుకున్నా

రెండో రోజు ఆట ముగిసిన తర్వాత మయాంక్ అగర్వాల్ మాట్లాడుతూ "భయాన్ని పోగొట్టుకున్నా. నా ఆలోచన ధోరణిని మార్చుకున్నా. దీంతో పరుగుల దాహం మొదలైంది. క్రీజులో కుదురుకున్నాక భారీ స్కోరు సాధించాలని భావిస్తా. అరంగ్రేటం చేసిన మెల్‌బోర్న్‌ టెస్టు ఎంతో ప్రత్యేకం. రహానేకు టెస్టు క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉంది" అని అన్నాడు.

రహానే సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది

రహానే సహకరించడం వల్లే ఇది సాధ్యమైంది

"అతడి సహకరించడంతోనే దీనిని సాధించా. తొలుత భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని ప్రణాళిక వేసుకున్నాం. దీంతో భారీ స్కోరు సాధించగలిగాం. డిక్లేర్‌ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు" అని అన్నాడు. టెస్టుల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు

బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు

ఈ జాబితాలో వినోద్ కాంబ్లి(ఐదు ఇన్నింగ్స్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా లెజెండర్ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ 13 ఇన్నింగ్స్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు చేశాడు. ఇక టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ, వినూ మన్కడ్‌, వసీమ్‌ జాఫర్‌ సరసన నిలిచాడు.

రూమ్‌కి వెళ్లి పబ్‌జీ ఆడతా?

రూమ్‌కి వెళ్లి పబ్‌జీ ఆడతా?

"ఈ రోజు రూమ్‌కి వెళ్లాక ఏమి చేస్తారు? మీ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ను చూస్తారా? లేదా సినిమా చూస్తారా" అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు "పబ్‌జీ ఆడతా?" అని మయాంక్‌ అగర్వాల్ బదులిచ్చాడు. ఇప్పటివరకు 8 టెస్టులు మాత్రమే ఆడిన మయాంక్‌ రెండు డబుల్ సెంచరీలు, మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు.

Story first published: Saturday, November 16, 2019, 9:32 [IST]
Other articles published on Nov 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X