లంచ్ బ్రేక్: సెంచరీకి చేరువలో మయాంక్.. ఆధిక్యంలో భారత్!!

ఇండోర్: స్థానిక హోల్కర్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 38 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో రోజు ఉదయం కీలక రెండు వికెట్లు కోల్పోయిన దశలో మయాంక్ అగర్వాల్ అర్ధ సెంచరీ చేయడంతో భారత ఇన్నింగ్స్ కుదురుకుంది. అగర్వాల్‌కి తోడు అంజిక్య రహానే నిలకడైన ప్రదర్శన చేయడంతో భారత్ ఆధిక్యంలోకి వెళ్ళింది.
పుజారా అర్ధ సెంచరీ:
ఈ రోజు ఉదయం 86 పరుగులతో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న ఛతేశ్వర పుజారా (54) అబూ జయేద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అయితే పుజారా కేవలం 68 బంతుల్లలోనే అర్ధ సెంచరీ చేసాడు. పుజారా అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపే ప్రయత్నం చేసాడు. బౌండరీలు బాదుతూ అర్ధ సెంచరీ చేసాడు.

కోహ్లీ డకౌట్:
అయితే స్కోర్ వేగం పెరిగే క్రమంలో కోహ్లీ (0) డకౌట్ అయ్యాడు. అబూ జయేద్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. హోమ్ టెస్టుల్లో స్కోరు చేయకుండా విరాట్ పెవిలియన్ చేరడం ఇది మూడోసారి మాత్రమే. 2016-17 సీజన్‌లో ఆసీస్‌తో పుణెలో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌటైన కోహ్లీ.. 2017-18 సీజన్‌లో శ్రీలంకతో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో సురంగ లక్మల్ బౌలింగ్‌లో సున్నాకే ఔటయ్యాడు.

నిలకడగా భారత ఇన్నింగ్స్:
కోహ్లీ అనంతరం అంజిక్య రహానేతో కలిసి మయాంక్ భారత స్కోరును ముందుకు నడిపాడు. మయాంక్, రహానే మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. ఈ జోడి ధాటిగా ఆడుతూ ఇప్పటికే 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 54 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ (91), రహానే (35) పరుగులతో ఉన్నారు.

పేస్ త్రయం బెంబేలు:
గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత పేస్ త్రయం ధాటికి బంగ్లాదేశ్ తొలి రోజే చాప చుట్టేసింది. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ ఆరంభంలోనే ప్రత్యర్థి పతనానికి బాటలు వేయగా.. ఆ తర్వాత రివర్స్ స్వింగ్‌తో పేసర్ మహ్మద్ షమీ బెంబేలెత్తించాడు. షమీ (3/27), ఇషాంత్ (2/20), ఉమేశ్ (2/47) నిప్పులు చెరగడంతో బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications