'మ్యాచ్ అయిపోయాక ఇంకా జరుగుతుందనే అనుకున్నా.. క్రికెట్ గురించి నేర్చుకోవాలి'

కోల్‌కతా: నాకు క్రికెట్ గురించి పెద్దగా తెలీదు. క్రికెట్ గురించి ఇంకా నేర్చుకోవాలి. అసలు మ్యాచ్ అయిపోయాక ఇంకా జరుగుతుందనే అనుకున్నా అని చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్ అన్నాడు. గత కొంతకాలంగా ఈడెన్ గార్డెన్‌లో గంట కొట్టిన తర్వాత మ్యాచ్‌ను ఆరంభించడం జరుగుతుంది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు తొలి రోజు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిసి ఈడెన్ గార్డెన్స్‌లో గంటను మోగించారు.

క్రికెట్ గురించి నేర్చుకోవాలి:
రెండో రోజు ఈడెన్‌లో బెల్‌ను భారత చదరంగ రారాజు, ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్.. ప్రస్తుత ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ మోగించారు. అయితే తాను బెల్ ఎందుకు కొట్టానో తెలీదు అంటున్నాడు కార్లసన్. తాజాగా కార్ల్‌సన్ మాట్లాడుతూ...'ఒక తెలివి తక్కువ వాడిలా ఆనంద్ పక్కన నిలబడి మాత్రమే గంటను కొట్టాను. నాకు క్రికెట్ గురించి పెద్దగా తెలీదు. నేను క్రికెట్ గురించి ఇంకా నేర్చుకోవాలి. అసలు మ్యాచ్ అయిపోయాక ఇంకా జరుగుతుందనే అనుకున్నా. మ్యాచ్ అయిపోయిందని ఆనంద్ చెప్పితే గాని నాకు తెలియదు' అని తెలిపాడు.

గంగూలీకి ధన్యవాదాలు:
టాటా స్టీల్ ర్యాపిడ్-బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్‌లో భాగంగా నగరంలో ఉన్న కార్ల్‌సన్.. ఆనంద్‌తో కలిసి గంటను కొట్టేందుకు బీసీసీఐ ఆహ్వానించింది. ఈ క్రమంలోనే వారిద్దరూ వచ్చి రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు గంటను మోగించారు. తమకు ఈ అవకాశం కల్పించిన బీసీసీఐకి, అధ్యక్షుడు గంగూలీకి ధన్యవాదాలు తెలియజేశారు. గంటను మోగించిన చిత్రాన్ని బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.

ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం:
తొలి డే/నైట్ టెస్టు సందర్భంగా క్రికెట్‌తో పాటు ఇతర క్రీడా ఆటగాళ్లను కూడా బీసీసీఐ సన్మానం చేస్తోంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టెన్నిక్ క్రీడాకారిణి సానియా మీర్జా, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్‌ను బెంగాల్ క్రికెట్ సంఘం సత్కరించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మూడు రోజుల్లోనే డే/నైట్ టెస్టు ముగియడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications