Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ: భారీ స్కోరు దిశగా టీమిండియా

India vs Bangladesh Live Score, World Cup 2019: Rohit Sharma leads India with a half-century

హైదరాబాద్: బర్మింగ్ హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో రోహిత్ శర్మకు ఇది 43వ హాఫ్ సెంచరీ. ప్రస్తుతం 17 ఓవర్లకు టీమిండియా వికెట్ నష్టపోకుండా 99 పరుగులు చేసింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

క్రీజులో రోహిత్ శర్మ(53), కేఎల్ రాహుల్(42) పరుగులతో ఉన్నారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతుండటంతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. అంతకముందు జట్టు స్కోరు 19 పరుగుల వద్ద తమీమ్ ఇక్బాల్ క్యాచ్ మిస్ చేయడంతో ఆ తర్వాత రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతికి మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న తమీమ్ ఇక్బాల్ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు.
అయితే ఒక్కసారిగా కంట్రోల్ తప్పడంతో బంతి అతడి చేతుల్లో నుంచి చేజారింది.

దీంతో మ్యాచ్ చూస్తోన్న అభిమానులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కేదార్ స్ధానంలో దినేశ్ కార్తీక్, కుల్దీప్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ కూడా రెండు మార్పులు చేసింది.

1
43683
Story first published: Tuesday, July 2, 2019, 16:23 [IST]
Other articles published on Jul 2, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+