భారత్‌లో తొలి డే నైట్ టెస్టు టీమిండియాదే: బంగ్లాపై ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో ఘన విజయం

హైదరాబాద్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత్‌లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగులతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. టీమిండియాకు ఇది వరుసగా నాలుగో ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం.
ఫలితంగా టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 152/6 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ 195 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ ఐదు, ఇషాంత్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టారు.
ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో వైట్‌వాష్ చేసింది. అంతకముందు ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ 360 పాయింట్లకు చేరింది.

152/6 ఓవర్ నైట్ స్కోర్‌తో
152/6 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆదివారం మూడో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ గంటలోపే ఇన్నింగ్స్‌ను ముగించింది. ఓవర్ నైట్ ఆటగాళ్లు తైజుల్ ఇస్లామ్(11), ముష్పికర్ రహీమ్(74)లతో పాటు ఎబాదత్ హుస్సేన్(0)ను టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ పెవిలియన్‌కు చేర్చాడు.

43 పరుగులు మాత్రమే జత చేసిన బంగ్లా
ఈ రోజు ఆటలో బంగ్లాదేశ్ మరో 43 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ ఐదు వికెట్లు, ఇషాంత్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టారు. ఇక, శనివారం రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ మహ్మదుల్లా మళ్లీ తిరిగి బ్యాటింగ్ చేసేందుకు రాలేదు.

9 వికెట్లతో ఇషాంత్ శర్మ టాప్‌లో
మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన ఇషాంత్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా నాలుగు వికెట్లతో చెలరేగాడు. దీంతో భారత్‌లో జరిగిన డే నైట్ టెస్టులో ఇషాంత్ శర్మ అత్యధికంగా మొత్తం 9 వికెట్లు సాధించాడు. ఇక, ఉమేశ్ యాదవ్ ఎనిమిది వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 347/9 వద్ద డిక్లేర్డ్ చేయగా, బంగ్లా 106 పరుగులకే ఆలౌటైంది.

టీమిండియా నయా రికార్డు
ఈ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించడంతో టెస్టు క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డుని నెలకొల్పింది. వరుసగా నాలుగోసారి ఇన్నింగ్స్ విజయం సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక జట్టు ఇలా వరుసగా నాలుగు ఇన్నింగ్స్ విజయాలు సాధించడం ఇదే మొదటిసారి. బంగ్లాదేశ్ జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలవగా, సఫారీలపై వరుస రెండు టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
స్కోరు వివరాలు:
తొలి ఇన్నింగ్స్
బంగ్లాదేశ్: 106 ఆలౌట్
భారత్: 347/9 డిక్లేర్డ్
రెండో ఇన్నింగ్స్
బంగ్లాదేశ్: 195 ఆలౌట్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications