For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి పింక్ బాల్ టెస్ట్: కోహ్లీ 27వ టెస్టు సెంచరీ, 347/9 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన భారత్

IND vs BAN,2nd Test : Virat Kohli Scores 27th Test Century During Pink Ball Test || Oneindia Telugu
India vs Bangladesh Live Score, Pink Ball Test Day 2: Kohli, Rahane look to extend advantage

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి డే నైట్ టెస్టులో టీమిండియా 347/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్‌పై 241 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 174/3తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా భారత్ దూకుడుగా ఆడింది.

ఈ క్రమంలో వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే(51; 69 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రహానేకి ఇది 22వ హాఫ్ సెంచరీ. హాఫ్‌సెంచరీ అనంతరం రహానే(51) తైజుల్‌ ఇస్లామ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో కోహ్లీ, రహానే 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కోహ్లీ సెంచరీతో చెలరేగాడు.

తైజుల్‌ ఇస్లామ్‌ వేసిన 68 ఓవర్‌ మూడో బంతికి రెండు పరుగులు తీయడం ద్వారా కోహ్లీ 159 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 101 పరుగులతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 27వ సెంచరీ కాగా మొత్తంగా 70వ సెంచరీ. ఇప్పటి వరకు తెలుపు, ఎర్ర బంతులతో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన కోహ్లీ పింక్‌ బాల్ టెస్టులో సైతం సెంచరీ సాధించాడు.

1
46120

ఫలితంగా భారత్‌లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే, 136 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఆరో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. కోహ్లీ ఔటైన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. వరుస ఓవర్లలో అశ్విన్ (9), ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు డకౌటయ్యారు.

అనంతరం క్రీజులోకి వచ్చిన షమీ సిక్సర్, ఫోర్‌తో పది పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే సమయానికి వృద్ధిమాన్‌ సాహా (17), మహ్మద్‌ షమి (10) క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్ హొసైన్, ఇబాదత్ హొసైన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా, అబు జాయెద్ రెండు, తైజుల్ ఇస్లాంకు ఒక వికెట్ లభించింది.

Nov 23, 2019, 5:21 pm IST

తొలి పింక్ బాల్ టెస్ట్: కోహ్లీ సెంచరీ, 347/9 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన భారత్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌ను 347/9 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 241 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో రోజైన శనివారం కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (136; 194 బంతుల్లో 18 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు చేసింది. టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే సమయానికి వృద్ధిమాన్‌ సాహా (17), మహ్మద్‌ షమి (10) క్రీజులో ఉన్నారు.

Nov 23, 2019, 4:49 pm IST

డ్రింక్స్ విరామానికి టీమిండియా 331/9

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా డ్రింక్స్ విరామానికి గాను 9 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సాహా(16), షమీ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 225 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Nov 23, 2019, 4:46 pm IST

వరుస ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా వరుస ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయింది. వరుసగా బౌండరీలు బాది మంచి ఊపుమీదున్న అశ్విన్(9) జట్టు స్కోరు 329 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో సంధ్య వెలుగులో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది. పింక్ బాల్ టెస్టులో మాజీ క్రికెటర్లు ఊహించినట్లే సాయంత్రం వేళ పేసర్లు చెలరేగుతున్నారు.

Nov 23, 2019, 4:41 pm IST

136 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔట్

బంగ్లాతో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. జట్టు స్కోరు 308 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ(136) హొస్సేన్ బౌలింగ్‌లో తైజుల్ ఇస్లామ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కోహ్లీ ఔటైన తర్వాత అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 84 ఓవర్లకు గాను టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేశాడు.

Nov 23, 2019, 3:52 pm IST

ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా

తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 289 పరుగుల వద్ద రవీంద్ర జడేజా(51) హాఫ్ సెంచరీ అనంతరం తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జడేజా ఔటైన తర్వాత క్రీజులోకి సాహా వచ్చాడు.

Nov 23, 2019, 3:14 pm IST

పింక్ బాల్ టెస్ట్, డే2: లంచ్ విరామానికి టీమిండియా 289/4

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టులో రెండో రోజు లంచ్ విరామ సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(130), జడేజా(12) పరుగులతో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌ల్లో టీమిండియా 183 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో రోజు మొదటి సెషన్‌లో టీమిండియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 115 పరుగులు చేసింది.

Nov 23, 2019, 3:11 pm IST

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. విరాట్ కోహ్లీ 159 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 101 పరుగులతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 27వ సెంచరీ కాగా మొత్తంగా 70వ సెంచరీ.వన్డేల్లో ఇప్పటికే విరాట్ కోహ్లీ 43 సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలుపు, ఎర్ర బంతులతో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ తాజాగా పింక్‌ బాల్ టెస్టులో సైతం సెంచరీ సాధించాడు. ఫలితంగా భారత్‌లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Nov 23, 2019, 2:31 pm IST

పింక్ బాల్ టెస్ట్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ

ఈడెన్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 160 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 27వ సెంచరీ కాగా కెప్టెన్‌గా 20వది కావడం విశేషం. దీంతో టెస్టుల్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో రికీ పాంటింగ్(19) సెంచరీల రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 25 సెంచరీతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Nov 23, 2019, 2:26 pm IST

నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా

ఈడెన్ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా రహానే రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 236 పరుగుల వద్ద రహానే(69 బంతుల్లో 51; 7 ఫోర్లు) తైజుల్ ఇస్లామ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రహానే ఔటైన తర్వాత క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు.

Nov 23, 2019, 2:24 pm IST

రహానే హాఫ్ సెంచరీ

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టులో రహానే హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రహానేకు ఇది 27వ హాఫ్ సెంచరీ. కాగా, వరుసగా నాలుగోది కావడం విశేషం. ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సైతం రహానే చక్కటి ప్రదర్శన చేశాడు.

Nov 23, 2019, 1:52 pm IST

ఇండియా-ఆస్ట్రేలియాల మధ్య డే నైట్ టెస్ట్ మ్యాచ్

వచ్చే వింటర్‌లో టీమిండియా-ఆస్ట్రేలియా డే నైట్ టెస్టు మ్యాచ్ ఆడితే చూడాలని ఉందని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో "వెల్ డన్ సౌరవ్... వచ్చే వింటర్‌లో ఆస్ట్రేలియాతో డే నైట్ టెస్ట్ ఆడితే చూడాలని ఉంది" అంటూ దాదా పింక్ బాల్ టెస్ట్‌పై చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు.

Nov 23, 2019, 1:48 pm IST

సెంచరీ దిశగా విరాట్ కోహ్లీ

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 174/3తో శనివారం రెండో రోజు ఆటను కొనసాగించిన కోహ్లీ, రహానె దూకుడుగా ఆడుతున్నారు. దీంతో వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 55 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ప్రస్తుతం 101 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

Nov 23, 2019, 1:46 pm IST

200 పరుగుల మార్క్‌ని అందుకున్న టీమిండియా

ఈడెన్ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టులో టీమిండియా 200 పరుగులు మార్కుని అందుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యం 94 పరుగులుగా ఉంది. ప్రస్తుతం క్రీజులో ఉన్న రహానే, కోహ్లీ ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డుని పరిగెత్తిస్తున్నారు.

Nov 23, 2019, 1:43 pm IST

రెండో గంట మోగించి మ్యాచ్‌ని ప్రారంభించిన విశ్వనాధ్ ఆనంద్-మాగ్నస్ కార్ల్సెన్

ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్ట్‌లో రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాధ్ ఆనంద్, ప్రస్తుత ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సెన్ రెండో రోజు గంట మోగించి మ్యాచ్‌ని ప్రారంభించారు

Nov 23, 2019, 1:37 pm IST

నాలుగో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం

హొస్సేన్ బౌలింగ్‌లో రహానే బౌండరీ బాదాడు. దీంతో కోహ్లీ-రహానేలు నాలుగో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం 56 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(80), రహానే(37) పరుగులతో ఉన్నారు.

Nov 23, 2019, 1:35 pm IST

రెండో తొలి బౌండరీని బాదిన కోహ్లీ

డే నైట్ టెస్టులో భాగంగా రెండో రోజైన శనివారం ఆట ప్రారంభమైంది. ఆటలో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ బంగ్లా బౌలర్ తైజుల్ బౌలింగ్‌లో బౌండరీ బాదాడు.

Nov 23, 2019, 1:18 pm IST

మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ

ఈడెన్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ గనుక సెంచరీ సాధిస్తే అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాలో రెండో స్థానంలో నిలుస్తాడు. ప్రస్తుతం కోహ్లీ-పాంటింగ్ ఇద్దరూ 19 సెంచరీలతో ఉన్నారు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 25 సెంచరీతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Nov 23, 2019, 1:12 pm IST

రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు కోహ్లీ ఇలా

తొలి పింక్ బాల్ టెస్టు రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు ఈడెన్ గార్డెన్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేశాడు.

Story first published: Saturday, November 23, 2019, 17:34 [IST]
Other articles published on Nov 23, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+