న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిరాశపరిచిన కోహ్లీ, పాండ్యా: ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

India vs Bangladesh Live Score, CWC 2019: Mustafizur Rahman Strikes Twice To Remove Virat Kohlif And Hardik Pandya

హైదరాబాద్: బర్మింగ్‌హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. ఈ ప్రపంచకప్‌లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలతో రాణించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(26: 27 బంతుల్లో 3ఫోర్లు) ఈ మ్యాచ్‌లో తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరి నిరాశపరిచాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ముస్తాఫిజుర్ వేసిన 39వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్‌ స్కేర్‌లెగ్‌లో రుబెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(0) కూడా ఎదుర్కొన్న రెండో బంతికే స్లిప్‌లో సౌమ్య సర్కార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది.

అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ చక్కటి శుభారంభాన్నిచ్చారు. షకీబ్ వేసిన 29వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో రోహిత్ శర్మ 92 బంతుల్లో 104(7 ఫోర్లు, 5 సిక్సులు) సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

దీంతో జట్టు స్కోరు 180 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇది వరల్డ్‌కప్‌లో భారత్‌కు అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం. అంతకముందు రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లు 174 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం సాధించారు. 2015 వరల్డ్‌కప్‌లో ధావన్‌తో కలిసి రోహిత్‌ ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డుని రోహిత్‌-రాహుల్‌లు బద్దలు కొట్టారు.

ఆ తర్వాత జట్టు స్కోరు 277 పరుగుల వద్ద రిషబ్ పంత్(48) షకీబ్ ఉల్ హాసన్ బౌలింగ్‌లో హుస్సేన్‌కు క్యాచ్ ఇవ్వడంతో తృటిలో హాఫ్ సెంచరీని మిస్సయ్యాడు. ప్రస్తుతం 45 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్లకు 279 పరుగులు చేసింది. క్రీజులో ధోని(11), దినేశ్ కార్తీక్(1) పరుగుతో ఉన్నారు.

1
43683

{headtohead_cricket_3_10}

Story first published: Tuesday, July 2, 2019, 18:30 [IST]
Other articles published on Jul 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X