For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2nd T20I: రోహిత్ శర్మ అరుదైన ఘనత, ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

 India vs Bangladesh Live Score, 2nd T20I: India have won the toss and have opted to field

హైదరాబాద్: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టీ20కి సర్వం సిద్ధమైంది. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరుగతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నాయి.

రోహిత్ శర్మకు ఇది 100వ టీ20 కావడం విశేషం. భారత్ తరుపున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరిస్‌లో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(98 టీ20లు) రికార్డుని రోహిత్ శర్మ అధిగమించిన సంగతి తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక టీ20లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్(111) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో అన్ని విభాగాల్లో విఫలమై టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది.

ఈ నేపథ్యంలో రెండో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌పై తొలి విజయం సాధించిన బంగ్లా.. అదే జోష్‌లో సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇదే జరిగితే బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.

1
46117

ఈ మ్యాచ్‌లో పలువురు టీమిండియా క్రికెటర్లను వ్యక్తిగత రికార్డులు ఊరిస్తున్నాయి. ఓపెనర్ శిఖర్ ధావన్ మొత్తంగా తన కెరీర్‌లో 100వ టీ20 మ్యాచ్‌ని ఆడుతున్నాడు. భారత్ తరుపున ఇది 56వ టీ20 కావడం విశేషం. మరోవైపు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన 50వ టీ20 మ్యాచ్‌ని ఆడుతున్నాడు.

ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఒక క్యాచ్ పడితే టీ20ల్లో వికెట్ కీపర్‌గా 50 క్యాచ్‌లను పూర్తి చేసుకుంటాడు. ఇక, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ మరో 10 పరుగులు చేస్తే ఈ ఏడాది టీ20ల్లో 1000 పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు. ఒక ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన మొదటి భారత్ బ్యాట్స్‌మెన్ కావడంతో పాటు మొత్తంగా 14వ ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు.

జట్ల వివరాలు
బంగ్లాదేశ్: లిటాన్ దాస్, మహ్మద్ నైమ్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహముదుల్లా (కెప్టెన్), అఫీఫ్ హుస్సేన్, మొసాద్‌డెక్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం, షఫీల్ ఇస్లాం, ముస్తఫిజుర్ రెహ్మాన్, అల్-అమీన్ హుస్సేన్

ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివం దుబే, క్రునాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, యజువేంద్ర చాహల్, ఖలీల్ అహ్మద్

Story first published: Thursday, November 7, 2019, 18:47 [IST]
Other articles published on Nov 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+