For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh, 2nd T20I: టీమిండియా విజయ లక్ష్యం 154

 India vs Bangladesh Live Score, 2nd T20I: Bowlers help India restrict Bangladesh to 153 for 6

హైదరాబాద్: రాజ్‌కోట్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 154 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు వికెట్లు తీయగా... వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మాద్, దీపక్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు మంచి ఆరంభం లభించింది. లిటన్ దాస్, మహ్మద్ నైమ్‌ల జోడీ తొలి వికెట్‌కి 60 పరుగులు జోడించారు. ఆ తర్వాత చాహల్ బౌలింగ్‌లో లిటన్ దాస్ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో నయిమ్(36) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

తొలి టీ20లో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ముష్ఫికర్ రహిమ్(4) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. చివర్లో సౌమ్య సర్కార్(30), కెప్టెన్ మహ్మదుల్లా(30) ఫరవాలేదనిపించడంతో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది.


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
అంతకముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ జట్టులో ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నాయి. రోహిత్ శర్మకు ఇది 100వ టీ20 కావడం విశేషం.

భారత్ తరుపున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరిస్‌లో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(98 టీ20లు) రికార్డుని రోహిత్ శర్మ అధిగమించిన సంగతి తెలిసిందే.

అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లు (top 5 men):
షోయబ్ మాలిక్ - 111
రోహిత్ శర్మ - 100
షాహిద్ అఫ్రిది - 99
ధోని - 98
రాస్ టేలర్ - 93

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక టీ20లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్(111) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో అన్ని విభాగాల్లో విఫలమై టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది.

ఈ నేపథ్యంలో రెండో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌పై తొలి విజయం సాధించిన బంగ్లా.. అదే జోష్‌లో సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఇదే జరిగితే బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.

ఈ మ్యాచ్‌లో పలువురు టీమిండియా క్రికెటర్లను వ్యక్తిగత రికార్డులు ఊరిస్తున్నాయి. ఓపెనర్ శిఖర్ ధావన్ మొత్తంగా తన కెరీర్‌లో 100వ టీ20 మ్యాచ్‌ని ఆడుతున్నాడు. భారత్ తరుపున ఇది 56వ టీ20 కావడం విశేషం. మరోవైపు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన 50వ టీ20 మ్యాచ్‌ని ఆడుతున్నాడు.

Story first published: Thursday, November 7, 2019, 21:00 [IST]
Other articles published on Nov 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+