For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండోర్ టెస్టులో మెరిసిన షమీ: తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 ఆలౌట్

India Vs Bangladesh 1st Test : Indian Bowlers Shine As Bangladesh Bundle Out For 150 Runs
India vs Bangladesh Live Score 1st Test Day 1: Shami stars, Bangladesh bowled out for 150

హైదరాబాద్: ఇండోర్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక బంగ్లాదేశ్ జట్టు టీమిండియా పేసర్ల దెబ్బకు చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది.

గురువారం తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్‌‌పై ఆద్యంతం టీమిండియాదే పైచేయిగా నిలిచింది. బంగ్లాదేశ్ జట్టులో ముష్ఫీకర్ రహీమ్(43; 105 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్)తో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ మోమినుల్ హక్(37; 80 బంతుల్లో 6 ఫోర్లు) ఫరవాలేదనిపించాడు.

మిగతా బ్యాట్స్‌మెన్ టీమిండియా పేసర్ల నిప్పులు చెరిగే బంతులను ఎదుర్కొనలేక చేతులెత్తేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా... రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, ఇశాంత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా బ్యాట్స్‌మెన్‌కు భారత బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. భారత బౌలర్ల ధాటికి 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు షాద్మాన్ ఇస్లాం(6), ఇమ్రుల్ కయాస్(6) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆరో ఓవర్‌లో ఇమ్రుల్‌ కైస్‌(6) ఉమేశ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో రహానె చేతికి చిక్కాడు.

లంచ్ విరామానికి 63/3

లంచ్ విరామానికి 63/3

మొహమ్మద్‌ మిథున్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్‌ రహీమ్‌‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. దీంతో లంచ్ విరామ సమయానికి బంగ్లాదేశ్ నిర్ణీత 26 ఓవర్లలో3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. లంచ్ విరామం అనంతరం టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు.

ముష్ఫికర్‌ రహీమ్‌ క్లీన్‌బౌల్డ్‌

ముష్ఫికర్‌ రహీమ్‌ క్లీన్‌బౌల్డ్‌

షమి వేసిన 54వ ఓవర్‌ ఐదో బంతికి తొలుత ముష్ఫికర్‌ రహీమ్‌(43) క్లీన్‌బౌల్డ్‌ కాగా, తర్వాతి బంతికే మెహెది హసన్‌(0) ఎల్బీగా వెనుదిరిగాడు. టీ విరామం అనంతరం ఇషాంత్‌ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతికే లిటాన్‌ దాస్‌(21) ఔటయ్యాడు. దీంతో జట్టు స్కోరు 140 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడు వికెట్లను కోల్పోవడం విశేషం.

140/5 నుండి 150కే ఆలౌట్

140/5 నుండి 150కే ఆలౌట్

అనంతరం తైజుల్‌ ఇస్లామ్‌ రనౌట్‌ కాగా, చివరి వికెట్‌గా ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఇబాదత్‌ హుస్సేన్‌(2) ఔటయ్యాడు. ఈ రోజు ఆటలో లంచ్‌ సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లా.. టీ విరామానికి మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. 140/5 స్థితిలో ఉన్న బంగ్లాదేశ్ చివరి ఐదు వికెట్లను 10 పరుగుల తేడాతో కోల్పోయి 150 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Thursday, November 14, 2019, 15:40 [IST]
Other articles published on Nov 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+