Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండోర్‌లో తొలి టెస్టు: చెలరేగుతున్న భారత పేసర్లు, లంచ్ విరామానికి బంగ్లా 63/3

 India vs Bangladesh Live Score 1st Test Day 1: Lunch on Day 1: Bangladesh 63 for 3 after India pacers strike

హైదరాబాద్: ఇండోర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు లంచ్ విరామ సమయానికి బంగ్లాదేశ్ 26 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మోమినుల్ హక్(22), ముష్ఫికర్ రహీమ్(14) ఉన్నారు.

బంగ్లాదేశ్ కోల్పోయిన మూడు వికెట్లలో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా బ్యాట్స్‌మెన్‌కు భారత బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. భారత బౌలర్ల ధాటికి 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఓపెనర్లు షాద్మాన్ ఇస్లాం(6), ఇమ్రుల్ కయాస్(6) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆరో ఓవర్‌లో ఇమ్రుల్‌ కైస్‌(6) ఉమేశ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో రహానె చేతికి చిక్కాడు. ఏడో ఓవర్‌లో షాద్మన్‌ ఇస్లామ్‌(6) ఇషాంత్‌ బౌలింగ్‌లో కీపర్‌ సాహా చేతికి దొరికిపోయాడు. టీమిండియా పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నారు.

ఆ తర్వాత మహ్మద్‌ షమి వేసిన 18వ ఓవర్‌ చివరి బంతికి మొహమ్మద్‌ మిథున్‌‌(13) ఎల్బీగా వెనుతిరిగాడు. దీంతో 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి బంగ్లా కష్టాల్లో పడింది. మొహమ్మద్‌ మిథున్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్‌ రహీమ్‌‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు.

దీంతో లంచ్ విరామ సమయానికి బంగ్లాదేశ్ నిర్ణీత 26 ఓవర్లలో3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది.

Story first published: Thursday, November 14, 2019, 12:06 [IST]
Other articles published on Nov 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+