తొలి డే నైట్ టెస్ట్: బంగ్లాదేశ్ 106 ఆలౌట్, 5 వికెట్లతో చరిత్ర సృష్టించిన ఇషాంత్ శర్మ

India vs Bangladesh Live Cricket Score, Pink Ball Test Match: India brace for history at Eden Gardens

హైదరాబాద్: భారత్‌లో తొలి డే నైట్ టెస్టు ప్రారంభమైంది. కోల్‌కతాలోనీ ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ప్రస్తుతం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న డే నైట్ టెస్టు 12వది కావడం విశేషం.

అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌లో డే నైట్ టెస్టు ఆడిన 9, 10వ జట్లుగా భారత్, బంగ్లాదేశ్‌లు నిలిచాయి.

ఈ డే నైట్ టెస్టు మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమై తొలి సెషన్‌ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. లంచ్ విరామం నలభై నిమిషాలు. అనంతరం 3:40 గంటలకు ప్రారంభమయ్యే రెండో సెషన్‌ 5:40వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 20 నిమిషాలు టీ విరామం ఉంటుంది.

ఆఖరి సెషన్‌ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. ఈ డే నైట్ టెస్టుని క్యాబ్ అంగరంగవైభవంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే కోల్‌కతాలోని వీధులన్నీ గులాబీమయం అయ్యాయి.

Auto Refresh Feeds
04:40 pm

బంగ్లాదేశ్ 106 ఆలౌట్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 106 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, షమీలు బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు. పదునైన బంతులతో వణికించారు. భారత పేసర్ల దెబ్బకు ఇద్దరు బంగ్లా బ్యాట్స్‌మన్‌కు గాయాలు కూడా అయ్యాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఓపెనర్ ఇస్లామ్ చేసిన 29 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. బంగ్లా జట్టులో నలుగురు ఆటగాళ్లు డకౌట్ కాగా, ఇద్దరు ఒక్కో పరుగు చేశారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 5 వికెట్లతో చెలరేగగా... ఉమేశ్ యాదవ్‌ 3, మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టారు.

04:31 pm

పింక్ బాల్ టెస్టులో ఐదు వికెట్లతో చెలరేగిన ఇషాంత్ శర్మ

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా పేసర్ ఇషాంత శర్మ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 30వ ఓవర్ ఐదో బంతికి నయీమ్ హుస్సేన్(19) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇషాంత్ శర్మకు ఈ మ్యాచ్‌లో ఇది ఐదో వికెట్. ఫలితంగా తొలి పింక్ బాల్ టెస్టులో ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

04:29 pm

నాలుగో వికెట్ తీసిన ఇషాంత్ శర్మ

ఈడెన్ గార్డెన్స్‌లో భార‌త్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో బంగ్లాదేశ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. లిట్టన్ దాస్‌ స్థానంలో కాంకషన్ సబ్‌సిట్యూట్‌గా క్రీజులోకి వచ్చిన మెహదీ హాసన్(8) పరుగుల వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 29 ఓవర్లకు బంగ్లాదేశ్ 8 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది.

04:22 pm

ప్లడ్ లైట్ల వెలుగులో ఈడెన్ గార్డెన్స్

ఈడెన్ గార్డెన్స్‌లో ప్లడ్ లైట్లు వెలిగాయి. భారత్‌లో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్ అందంగా ముస్తాబైంది. ప్లడ్ లైట్ల వెలుగులో ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కార్నివాల్‌ను తలపిస్తోంది. పింక్‌బాల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన క్రికెట్‌ అభిమానులు, ప్రముఖులతో ఈడెన్‌ గార్డెన్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది.

04:19 pm

లిట్టన్ దాస్ కాంకషన్ సబ్‌సిట్యూట్‌గా మెహదీ హాసన్

లంచ్ విరామానికి ముందు షమీ వేసిన బౌన్సర్‌కు గాయపడి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగిన లిట్టన్ దాస్‌కు బదులు కాంకషన్ సబ్‌సిట్యూట్‌గా మెహదీ హాసన్ క్రీజులోకి వచ్చాడు. భారత్‌లో జరిగిన టెస్టుల్లో ఇది రెండో కాంకషన్ సబ్‌సిట్యూట్ కావడం విశేషం. అయితే, మెహదీ హాసన్ ఈ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తాడో లేదో తెలియాల్సి ఉంది.

04:14 pm

బంగ్లా బ్యాట్స్‌మన్ కోసం భారత ఫిజియో

పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన బౌన్సర్లతో బంగ్లా బ్యాట్స్ మెన్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. ఇప్పటికే షమీ బౌలింగ్‌లో లిట్టన్ దాస్ గాయపడి రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరగగా... తాజాగా షమీ బౌన్సర్ మరో బంగ్లా బ్యాట్స్‌మన్ నయిం హాసన్ హెల్మెట్‌ను బలంగా తాకింది. సహాయం కోసం పిలుపునివ్వడంతో అదే సమయంలో అక్కడే ఉన్న భారత ఫిజియో నితిన్ పటేల్ మైదానంలోకి పరిగెత్తకుంటా వచ్చాడు. కొంత సేపటి తర్వాత అంతా సర్దుకోవడంతో తిరిగి బ్యాటింగ్ ప్రారంభించాడు.

04:07 pm

షమీ దెబ్బకు లిట్టన్ దాస్ రిటైర్డ్‌ హర్ట్‌

మొదటి సెషన్ ఆఖరి ఓవర్‌లో టీమిండియా పేసర్ మహ్మద్‌ షమీ వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్ మూడో బంతి లిటన్‌ తలను బలంగా తాకింది. దీంతో అతడు మైదానంలోనే కొంత కలవరపాటుకు గురై హెల్మెట్‌ను తీసి చూసుకున్నాడు. అదే సమయంలో మైదానంలోకి పరుగెత్తుకు వస్తోన్న ఫిజియోకు ఫర్వాలేదని చెప్పిన లిట్టన్ దాస్‌ తిరిగి తన ఆటను కొనసాగించాడు. ఆ తర్వాతి బంతికి ఏమైందో తెలియదు గానీ లెగ్‌ అంపైర్‌ వద్దకు వెళ్లి ఇబ్బందిగా ఉందని చెప్పాడు. దీంతో వెంటనే ఫిజియో వచ్చి అతడి పరిస్థితిని సమీక్షించి అతడిని రిటైర్డ్‌ హర్ట్‌గా తీసుకెళ్లాడు.

03:18 pm

ఒంటి చేత్తో సూపర్‌మ్యాన్‌లా క్యాచ్ పట్టిన రోహిత్ శర్మ

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినుల్ హక్‌ను రోహిత్ శర్మ ఓ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చిన సంగతి తెలిసిందే. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో మొమినుల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ని స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న రోహిత్ శర్మ అమాంతం సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి క్యాచ్‌గా పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో బీసీసీఐ తన ఫేస్‌బుక్ పేజిలో పోస్టు చేసింది.

03:11 pm

లంచ్ విరామానికి బంగ్లాదేశ్ 73/6

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భార‌త్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో బంగ్లాదేశ్ లంచ్ విరామానికి 6 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లిట్టన్ దాస్(24), నయిమ్ హాసన్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ కోల్పోయిన ఆరు వికెట్లలో ఉమేశ్ యాదవ్ 3, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీయగా షమీకి ఒక వికెట్ లభించింది.

03:07 pm

సాహా సూపర్ క్యాచ్, ఆరో వికెట్ కోల్పోయిన బంగ్లా

పింక్ బాల్ టెస్ట్‌లో బంగ్లా ఆరో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో మహ్మదుల్లా(6) వికెట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 19.4 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ 60/6 స్థితిలో ఉంది.

03:05 pm

ఈ మ్యాచ్‌లో మొదటి స్పిన్ ఓవర్‌లో 5 పరుగులు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్ట్‌లో రవీంద్ర జడేజా వేసిన మొదటి స్పిన్ ఓవర్‌లో టీమిండియా ఐదు పరుగులు ఇచ్చింది. ప్రస్తుతం 19 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో మహముదుల్లా (6), లిటాన్ దాస్ (15) పరుగులతో ఉన్నారు.

02:35 pm

ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లా

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భార‌త్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ రెండో బంతికి బంగ్లా ఓపెనర్ ఇస్లామ్(29) వికెట్ కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బంగ్లాదేశ్ కోల్పోయిన ఐదు వికెట్లలో ఉమేశ్ యాదవ్‌ 3 వికెట్లు తీయ‌గా, ఇశాంత్‌, ష‌మీలు చెరో వికెట్ తీశారు.

02:09 pm

నాలుగో వికెట్ తీసి షమీ

పింక్ టెస్టులో భార‌త బౌల‌ర్లు విజృంభించారు. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భార‌త బౌల‌ర్ల ధాటికి బంగ్లాదేశ్ విల‌విల‌లాడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ అప్పుడే నాలుగు వికెట్ల‌ను కోల్పోయింది. 11వ ఓవ‌ర్‌లో ఉమేశ్ యాద‌వ్ రెండు వికెట్లు తీసి బంగ్లాను క‌ష్టాల్లో నెట్టగా.... షమీ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ ఐదో బంతికి ముష్ఫికర్ రహీమ్ ఔటయ్యాడు. ప్ర‌స్తుతం 12 ఓవ‌ర్ల‌లో బంగ్లా నాలుగు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.బంగ్లాదేశ్ కోల్పోయిన నాలుగు వికెట్లలో ఇమ్రుల్ 4 ప‌రుగులు చేయ‌గా.. హ‌క్‌, మిథున్‌లు డ‌కౌట‌య్యారు.

02:04 pm

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్

ఒకే ఓవర్‌లో బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్‌ తొలి బంతికి బంగ్లా కెప్టెన్ మొమినుల్ హక్ డకౌట్‌గా వెనుదిరిగగా.. ఆ తర్వాత అదే ఓవర్ మహ్మద్ మిథున్ కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో బంగ్లాదేశ్ 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

02:01 pm

రోహిత్ శర్మ సూపర్ క్యాచ్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో బంగ్లా కెప్టెన్ మొమినుల్ హక్(0)స్లిప్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

01:45 pm

రివ్యూ కోల్పోయిన టీమిండియా

టీమిండియా ఒక రివ్యూని కోల్పోయింది. మహ్మద్ షమీ వేసిన బంతి ఇస్లామ్ బ్యాట్‌కు తగిలి తగనట్లుగా వెళ్లి వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేతిలో పడింది. టీమిండియా ఎంత విజ్ఞప్తి చేసినప్పటికీ అంఫైర్ ఎరాస్మస్ స్పందించలేదు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ కీపర్ సాహాతో చర్చించి రివ్యూకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. రీప్లేలో బంతి బ్యాట్ యొక్క అంచుని తగలకపోవడంతో టీమిండియా ఒక రివ్యూని కోల్పోయింది.

01:40 pm

10 ఏళ్ల తర్వాత కేబీసీలో క్వశ్వన్ ఇదీ

భారత్‌లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్ట్‌లో తొలి వికెట్ తీసిన బౌలర్ ఎవరు? 10 ఏళ్ల తర్వాత కేబీసీలో అడిగే క్వశ్వన్ ఇదంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు.

01:34 pm

తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్, ఇషాంత్ శర్మ అరుైదన ఘనత

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఓపెనర్ ఇమ్రుల్(4) పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఇషాంత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. భారత్‌లో తొలి పింక్ బాల్ టెస్ట్‌లో తొలి వికెట్ తీసిన బౌలర్‌గా నిలిచాడు.

01:32 pm

ఈ స్టేడియంలోనే రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు

ఇదే స్టేడియంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక పరుగుల వ్యక్తిగత స్కోరుని నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ(264) పరుగులతో ఈ రికార్డు సాధించాడు.

01:26 pm

పింక్ బాల్ టెస్ట్‌లో తొలి బౌండరీ కొట్టింది ఎవరో తెలుసా?

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టులో తొలి బౌండరీ నమోదైంది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో బంగ్లా ఓపెనర్ ఇస్లామ్ తొలి బౌండరీని బాదాడు. ఆఫ్ స్టంప్‌కు అవతలగా వేసిన బంతిని బ్యాక్ పుట్ తీసుకుని డీప్ పాయింట్ మీదుగా బౌండరీకి తరలించాడు.

01:23 pm

తొలి ఓవర్ ఇషాంత్ శర్మదే

ఇషాంత్ శర్మ డే నైట్ టెస్ట్‌ను తొలి ఓవర్ తో ప్రారంభించాడు. తన పదునైన బంతులతో తొలి ఓవర్‌ను ఇషాంత్ శర్మ మెయిడిన్ చేశాడు. ప్రస్తుతం 3 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ వికెట్ కోల్పోకుండా ఐదు పరుగులు చేసింది. క్రీజులో ఇస్లామ్(2), ఇమ్రుల్(3) పరుగులతో ఉన్నారు.

01:18 pm

గంట మోగించి మ్యాచ్‌ను ప్రారంభించిన షేక్ హసీనా, మమతా బెనర్జీ

పశ్చిమ్‌ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాలు సంయుక్తంగా గంట మోగించి మ్యాచ్‌ని అధికారికంగా ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.

01:11 pm

బంగ్లా ప్రధానికి ఆటగాళ్లను పరిచయం చేసిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ

మ్యాచ్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బెంగాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇరు జట్ల ఆటగాళ్లను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పరిచయం చేశాడు. ఈ సందర్భంగా బంగ్లా ప్రధాని షేక్ హసీనా, మమతా బెనర్జీ ఆటగాళ్లతో ముచ్చటించారు.

01:06 pm

తొలి పింక్ బాల్ టెస్టు మ్యాచ్ సాగుతుందిలా..:

తొలి సెషన్‌ - మధ్యాహ్నాం 1 గంట నుంచి 3 గంటల వరకు లంచ్ బ్రేక్(40 నిమిషాలు) రెండో సెషన్‌ - మధ్యాహ్నాం 3.40 గంటల నుంచి 5.40 టీ విరామం(20 నిమిషాలు) మూడో సెషన్‌ - సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8

01:02 pm

హిస్టారికల్ మూమెంట్‌గా అభివర్ణించిన కోచ్ రవిశాస్త్రి

పింక్ బాల్ టెస్టుకు ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడారు. భారత క్రికెట్ చరిత్రలో దీనిని ఒక హిస్టారికల్ మూమెంట్‌గా అభివర్ణించారు. భారత జట్టులోని ఆటగాళ్లు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలిపాడు.

12:58 pm

కోల్‌కతాకు చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనా

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా బంగ్లా ప్రధాని షేక్ హసీన, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కానున్నారు. వీరిద్దరూ సంయుక్తంగా గంట మోగించి మ్యాచ్‌ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఇందుకోసం బంగ్లా ప్రధాని షేక్ హసీనా కొద్ది సేప‌టి క్రితం కోల్‌క‌తా సుభాష్ చంద్ర బోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఆమెకు ఘన స్వాగతం పలికారు.

12:58 pm

జట్ల వివరాలు:

భారత్: మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌ శర్మ, ఛెటేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్‌ సాహా, ఉమేశ్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ బంగ్లాదేశ్‌: షాద్మన్‌ ఇస్లామ్‌, ఇమ్రుల్‌ కయేస్‌, మొమినల్‌ హఖ్‌ (కెప్టెన్), మహ్మద్‌ మిథున్‌, ముష్ఫికర్ రహీమ్‌, మహ్మదుల్లా, లిటన్‌ దాస్‌, నయీమ్‌ హసన్‌, అబు జయేద్‌, అల్‌ అమిన్‌ హుస్సేన్‌, ఇబాదత్ హుస్సేన్‌

12:55 pm

మార్పుల్లేకుండా బరిలోకి టీమిండియా

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ స‌మం చేయాల‌ని బంగ్లా భావిస్తుంది. బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఈ మ్యాచ్‌ని గంట కొట్టి ప్రారంభించ‌నున్నారు. అతిర‌థ మ‌హార‌ధులు హాజ‌రైన నేప‌థ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గట్టి చర్యలు తీసుకుంది బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌). భారత క్రికెట్‌ దిగ్గజాలు సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌ దేవ్‌, సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్ ఈ మ్యాచ్‌లో ప్రత్యేకంగా సంద‌డి చేయ‌నున్నారు. ఎలాంటి మార్పులు లేకుండానే భార‌త్ ఈ మ్యాచ్‌లో రంగంలోకి దిగుతుంది.

12:51 pm

పింక్ బాల్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

భారత్‌లో తొలిసారి జరుగుతున్న డే నైట్ టెస్టు కోసం పింక్ బాల్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ పింక్ బాల్‌ను తయారు చేయడానికి 8 రోజులు పడుతుంది. పింక్ బాల్ ఇన్నర్ కోర్‌ను కోర్క్, రబ్బర్‌తో తయారు చేస్తారు. పింక్ బాల్ చుట్టుకొలత 22.5 సెంటీమీటర్లు.

12:33 pm

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి డై నైట్ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

Story first published: Friday, November 22, 2019, 12:30 [IST]
Other articles published on Nov 22, 2019
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more