Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈడెన్‌లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్: షమీ దెబ్బకు లిట్టన్ దాస్ రిటైర్డ్‌ హర్ట్‌

IND vs BAN,2nd Test : Liton Das Retired Hurt After Blow On Helmet By Shami || Oneindia Telugu
India vs Bangladesh Live Cricket Score, Pink Ball Test Day 1: Litton Das retires hurt

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా పేసర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ విలవిల్లాడుతున్నారు. మొదటి సెషన్ ఆఖరి ఓవర్‌లో టీమిండియా పేసర్ మహ్మద్‌ షమీ వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్ మూడో బంతి లిటన్‌ తలను బలంగా తాకింది.

దీంతో అతడు మైదానంలోనే కొంత కలవరపాటుకు గురై హెల్మెట్‌ను తీసి చూసుకున్నాడు. అదే సమయంలో మైదానంలోకి పరుగెత్తుకు వస్తోన్న ఫిజియోకు ఫర్వాలేదని చెప్పిన లిట్టన్ దాస్‌ తిరిగి తన ఆటను కొనసాగించాడు. ఆ తర్వాతి బంతికి ఏమైందో తెలియదు గానీ లెగ్‌ అంపైర్‌ వద్దకు వెళ్లి ఇబ్బందిగా ఉందని చెప్పాడు.

దీంతో వెంటనే ఫిజియో వచ్చి అతడి పరిస్థితిని సమీక్షించి అతడిని రిటైర్డ్‌ హర్ట్‌గా తీసుకెళ్లాడు. అదే సమయంలో అంఫైర్లు లంచ్ విరామం ప్రకటించడంతో లిట్టన్ దాస్‌(24; 27 బంతుల్లో 5 పోర్లు) పెవిలియన్‌కు చేరాడు. దీంతో తొలిరోజు లంచ్‌ విరామ సమయానికి బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.

నయిమ్ హాసన్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ను భారత పేసర్లు కోలుకోలేని దెబ్బతీశారు. మ్యాచ్ ఆరంభం నుంచే పేసర్లు రెచ్చిపోయారు. దీంతో బంగ్లాదేశ్‌లోని ముగ్గురు బ్యాట్స్‌మన్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. బంగ్లా ఓపెనర్ షాద్‌మన్‌ ఇస్లామ్‌(29) ఫర్వాలేదనిపించగా... మరో ఓపెనర్ ఇమ్రుల్‌(4) నిరాశపరిచాడు.

మిగతా నలుగురు దారుణంగా విఫలమయ్యారు. మోమినుల్‌, మహ్మద్‌ మిథున్‌, ముష్పికర్‌ రహీమ్‌లు డకౌట్ అయ్యారు. బంగ్లాదేశ్ కోల్పోయిన ఆరు వికెట్లలో ఉమేశ్ యాదవ్ 3, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీయగా షమీకి ఒక వికెట్ లభించింది.

Story first published: Friday, November 22, 2019, 16:11 [IST]
Other articles published on Nov 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+