Day-Night Test: పింక్ బాల్‌తో టీమిండియా ప్రాక్టీస్.. షురూ చేసింది కోహ్లీనే!!

ఇండోర్: ఇండోర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య గురువారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. అయితే భారత ఆటగాళ్లు ఇండోర్ టెస్ట్ మ్యాచ్ కోసం కాకుండా.. 22-26 మధ్య కోల్‌కతాలో జరిగే తొలి డే-నైట్ మ్యాచ్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఫ్లడ్‌లైట్ల కింద గులాబీ బంతిని ఎలా ఎదుర్కోవాలి అని ఆటగాళ్లు అందరూ పింక్ బాల్‌తో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు.

గులాబీ బంతులతో ప్రాక్టీస్:
తొలి టెస్టు కోసం ఇండోర్‌లో మంగళవారం చేసిన సన్నాహకాల్లో గులాబీ బంతులతోనే టీమిండియా ఆటగాళ్లు ఎక్కువసేపు ప్రాక్టీస్ చేశారు. రాత్రి సమయంలో పింక్ బాల్ ఎలా కనిపిస్తుందో ప్రయత్నించేందుకు మైదానంలో వెలుతురు తక్కువగా ఉన్న ప్రదేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ నెట్‌లలో చెమటోడ్చారు. డేనైట్ టెస్టు కోసం అలవాటు పడేందుకే ఆటగాళ్లు సంప్రదాయ ఎర్ర బంతితో కాకుండా ఈసారి పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశారు.

అందరికంటే ముందుగా కోహ్లీనే:
అందరికంటే ముందుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాడు. పింక్ బాల్‌తో ఎక్కువగా డిఫెన్స్ ఆడాడు. కొత్త రంగు బంతిని ఎదుర్కోవడంలో కోహ్లీ ఎలాంటి ఇబ్బందికి గురికాలేదు. అనంతరం ఛతేశ్వర పుజారా, శుబ్‌మన్ గిల్ కూడా పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశారు. బౌన్స్ వల్ల యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కాస్త ఇబ్బంది పడ్డట్లు కనిపించాడు.

ఎన్‌సీఏ ప్రత్యేక ప్రాక్టీస్:
డే-నైట్ టెస్టుకు ముందు ప్రాక్టీస్ చేసేందుకు మధ్యలో తక్కువ సమయమే ఉండడంతో అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్, పుజార, మహమ్మద్ షమీ ఇటీవలే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో గులాబీ బంతులతో ప్రాక్టీస్ చేశారు. ప్రత్యేకంగా ఈ పింక్‌బాల్ ప్రాక్టీస్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసింది.

పింక్ బాల్‌తో ఆడటం మొదటిసారి:
టీమిండియాలో చాలా మందికి పింక్ బాల్‌తో ఆడటం ఇదే కొత్త. విరాట్ కోహ్లీ సహా చాలా మందికి పింక్ బాల్‌తో ఆడిన అనుభవం లేదు. పుజారా, మయాంక్, విహారి, కుల్దీప్‌లకు మాత్రం కూకబుర్రా గులాబీ బంతులతో దులీప్ ట్రోఫీ ఆడిన అనుభవం ఉంది.

రాత్రి సమయంలో సమస్య:
రాత్రి సమయంలో గులాబీ బంతిని చూడటంలో సమస్య ఎదురవుతుందని పుజారా అన్నాడు. 'ఇప్పటికే దులీప్ ట్రోఫీలో పింక్ బాల్‌తో ఆడా. అది మంచి అనుభవం. దేశవాళీ క్రికెట్‌లో అలా ఆడిన అనుభవం ఇప్పుడు నాకు పనికొస్తుంది. అయితే పగటి సమయంలో పిం బాల్‌తో ఏ సమస్యా ఉండదు. కానీ.. చీకటి పడినపుడు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బంతిని చూడటం కష్టమవుతుందని అనికుంటున్నా. అదే జరిగితే మ్యాచ్‌లో ఆ రాత్రి సెషనే కీలకంగా కానుంది' అని పుజారా అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications