For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh: బంగ్లాదేశ్‌తో భారత్ చర్చలు.. ఈడెన్‌ గార్డెన్స్‌లో డేనైట్‌ టెస్టు?!!

India vs Bangladesh: India propose day-night Test in Kolkata against Bangladesh

ఢిల్లీ: టీమిండియా తొలిసారి డేనైట్‌ టెస్టులు ఆడడానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లు పింక్ బాల్‌తో మ్యాచ్‌లు ఆడగా.. అన్ని కుదిరితే త్వరలో భారత్ కూడా పింక్ బాల్‌తో ఆడనుంది. టీమిండియాతో డేనైట్‌ టెస్టు ఆడాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) కోరిందని బీసీబీ ఆపరేషన్స్ ఛైర్మన్‌ అక్రమ్‌ ఖాన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఆటగాళ్లతో చర్చించి రెండు రోజుల్లో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

డేనైట్‌ టెస్టు ఆడాలని కోరిన బీసీసీఐ:

డేనైట్‌ టెస్టు ఆడాలని కోరిన బీసీసీఐ:

'మూడు రోజుల క్రితం బీసీసీఐ నుంచి మాకు ఓ లేఖ అందింది. డేనైట్‌ టెస్టు ఆడాలని లేఖలో బీసీసీఐ కోరింది. రెండు రోజుల్లో దానిపై ఆలోచించి బీసీబీ నిర్ణయాన్ని వెల్లడిస్తాం. అయితే ఇప్పటివరకు దాని గురించి ఆలోచించలేదు. డేనైట్‌ టెస్టులు క్రికెట్ ఆటకు ఎంతో దోహదం చేస్తాయని నా అభిప్రాయం. అందరితో చర్చిస్తాం' అని అక్రమ్‌ఖాన్‌ ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కి తెలిపారు.

ఆటగాళ్లతో చర్చిస్తాం:

ఆటగాళ్లతో చర్చిస్తాం:

'డేనైట్‌ టెస్టు గురించి ముందుగా ఆటగాళ్లు, జట్టు యాజమాన్యంతో చర్చిస్తాం. డేనైట్‌ టెస్టు నైపుణ్యానికి సంబంధించినది. పింక్‌ బాల్‌తో ఆటగాళ్లు సన్నద్ధమవ్వడానికి సమయం ఉందా లేదా అనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. గతంలో డేనైట్‌ టెస్టులు కూడా మంచి ఫలితాలనే ఇచ్చాయి' అని బీసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిజాముద్దీన్‌ చౌదరి అన్నారు.

ఈడెన్‌ గార్డెన్స్‌లో డేనైట్‌ టెస్టు:

ఈడెన్‌ గార్డెన్స్‌లో డేనైట్‌ టెస్టు:

భారత్ పర్యటనలో బంగ్లాదేశ్‌ టీ20, టెస్ట్ సిరీస్ ఆడనుంది. టీ20ల సిరీస్‌లో భాగంగా నవంబర్‌ 3న ఢిల్లీ వేదికగా బంగ్లాతో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అనంతరం రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా 14 నుండి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు 22 నుంచి రెండో టెస్టు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆడాల్సి ఉంది. ఒకవేళ బీసీబీ డేనైట్‌ టెస్టుకు అంగీకరిస్తే.. బీసీసీఐ అధ్యక్షడు సౌరవ్ గంగూలీ సొంత మైదానమైన ఈడెన్‌ గార్డెన్స్‌లో మ్యాచ్‌ నిర్వహించాలని బీసీసీఐ బావిస్తోంది.

కోహ్లీ కూడా సముఖంగానే:

కోహ్లీ కూడా సముఖంగానే:

సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారత క్రికెట్‌లో పలు మార్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగా డేనైట్‌ టెస్టులు నిర్వహించాలని కూడా దాదా చూస్తున్నాడు. ఇందుకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సముఖంగా ఉన్నాడని గంగూలీ పేర్కొన్న విషయం తెలిసిందే.

Story first published: Monday, October 28, 2019, 9:48 [IST]
Other articles published on Oct 28, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+