For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డే 2, నమోదైన రికార్డులివే: భారత్ 687 డిక్లేర్డ్, బంగ్లా 41/1

హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ 150 పరుగులు పూర్తి చేశాడు. తొలి రోజైన గురువారం దూకుడుగా ఆడి సెంచరీని పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

By Nageshwara Rao

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. భారత బ్యాట్స్‌మెన్ రాణించడంతో తన తొలి ఇన్నింగ్స్‌ను 687 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. కెప్టెన్ కోహ్లీ డబుల్ సెంచరీ చేయగా, మురళీ విజయ్, సాహా సెంచరీలు నమోదు చేశారు.

ఇక పుజారా 83, రహానే 82, జడేజా 60, అశ్విన్ 34 పరుగులు నమోదు చేశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇక్బాల్‌(24, నాటౌట్‌), మోమినుల్‌ హక్‌ ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు.తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 646 పరుగులు వెనకబడి ఉంది. భారత బౌలర్ ఉమేశ్ యాదవ్‌ ఒక వికెట్ తీసుకున్నాడు.


రెండో రోజు ఆట సాగిందిలా:

బంగ్లాదేశ్‌తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా భారీ స్కోరు చేసింది. భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. తద్వారా వరుసగా మూడోసారి టీమిండియా 650కు పైగా పరుగులు సాధించింది. టాస్ గెలిచిన టీమిండియా తొలి రోజు ఆటలో మురళీ విజయ్ 108, పుజారా 83, కోహ్లీ 204లు రాణించగా రెండో రోజైన శుక్రవారం రహానే 2, సాహా 106, జడేజా 60 పరుగులతో రాణించడంతో భారత్ 166 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 687 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది.

153 బంతుల్లో సెంచరీ చేసిన వృద్ధిమాన్ సాహా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌‌లో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా సెంచరీ సాధించాడు. 153 బంతుల్లో సాహా 7 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. టెస్టుల్లో సాహాకి ఇది రెండో సెంచరీ కావడం విశేషం. 165 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా 681 పరుగులు చేసింది. ప్రస్తుతం వృద్ధిమాన్‌ సాహా 105, రవీంద్ర జడేజా 55 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అర్ధసెంచరీ చేసిన రవీంద్ర జడేజా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌‌లో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా ఆర్ధసెంచరీని పూర్తి చేశాడు. 68 బంతులను ఎదుర్కొన్న జడేజా 2 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో అర్ధసెంచరీ (50 పరుగులు) సాధించాడు.

టీ విరామానికి టీమిండియా 620/6

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌‌లో టీ విరామానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 620 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం వృద్ధిమాన్‌ సాహా 83, రవీంద్ర జడేజా 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

600 పరుగులు దాటిన టీమిండియా స్కోరు
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌‌లో టీమిండియా స్కోరు 600 పరుగులను దాటింది. 151 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా 617 పరుగులు చేసింది. ప్రస్తుతం వృద్ధిమాన్‌ సాహా 81, రవీంద్ర జడేజా 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

సాహా అర్ధ సెంచరీ
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌‌లో టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా అర్ధసెంచరీని పూర్తి చేశాడు. సాహాకి ఇది ఐదో టెస్టు అర్ధసెంచరీ కావడం విశేషం.

డబుల్ సెంచరీ అనంతరం అవుటైన కోహ్లీ
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌‌లో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ డబుల్ సెంచరీ చేసిన వెంటనే తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో కోహ్లీ 204 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కోహ్లీ అవుటైన వెంటనే క్రీజులోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. దీంతో 127 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 496 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సాహా 10, అశ్విన్ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

India Vs Bangladesh, Hyderabad Test Day 2: Kohli-Rahane eye big totalfor hosts

డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ

లంచ్ విరామ అనంతరం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌‌లో కోహ్లీ డబుల్ సెంచరీ చేశాడు. 199 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ ఫోర్ బాది డబుల్ సెంచరీని నమోదు చేశాడు. 240 బంతుల్లో 24 ఫోర్ల సాయంతో కోహ్లీ డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా వరుసగా నాలుగు సిరిస్‌లలో డబుల్ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతక ముందు కోహ్లీ ఆడిన వెస్టిండిస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సిరిస్‌లలో వరుసగా డబుల్ సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో 124 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా 493 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 203, సాహా 8 పరుగులతో ఉన్నారు.

లంచ్ విరామానికి టీమిండియా 477/4

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో లంచ్ విరామానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 477 పరుగలు చేసింది. రెండో రోజైన శుక్రవారం భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 191, సాహా 4 పరుగులతో ఉన్నారు.

నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే... తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో మెహిదీ హసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 133 బంతులను ఎందుర్కొన్న రహానే 11 ఫోర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. రహానే అవుటైన తర్వాత వృద్ధిమాన్ సాహా బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో టీమిండియా 115 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 457 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 175, సాహా 0 పరుగులతో ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న టీమిండియా

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. వన్డే తరహాలో భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు. కెప్టెన్‌ కోహ్లి, రహానే దూకుడుతో టెస్టు మ్యాచ్‌ కాస్త వన్డేగా మారిపోయింది. వీరిద్దరూ ఓవర్‌కు 5కుపైగా రన్‌రేట్‌తో పరుగులు సాధిస్తున్నారు. బంగ్లా బౌలర్లను తెగ ఆడేసుకుంటున్నారు. దీంతో 111 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 170, రహానే 81 పరుగులతో ఉన్నారు.

150 పరుగులు చేసిన కోహ్లీ

హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ 150 పరుగులు పూర్తి చేశాడు. తొలి రోజైన గురువారం దూకుడగా ఆడి సెంచరీని పూర్తి చేసిన కోహ్లీ రెండో రోజు ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 172 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 19 ఫోర్లతో 150 పరుగులు సాధించాడు. దీంతో భారత జట్టు 99 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే 58, కోహ్లీ 150 పరుగులతో ఉన్నారు.

రహానే అర్ధసెంచరీ

హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో రహానే అర్ధసెంచరీని పూర్తి చేశాడు. 76 బంతులను ఎదుర్కొన్న రహానే 8 ఫోర్ల సాయంతో అర్ధసెంచరీని సాధించాడు. దీంతో 96 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రహానే 51, కోహ్లీ 129 పరుగులతో ఉన్నారు.

నగరంలోని ఉప్పల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ రెండో రోజైన శుక్రవారం ప్రారంభమైంది. 356/3 ఓవర్ నైట్ స్కోరుతో టీమిండియా రెండో రోజు ఆటను ప్రారంభించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లను కోల్పోయి 356 పరుగులు చేసింది.

ఆట ముగిసే సమయానికి క్రీజులో కోహ్లీ 111, రహానే 45 పరుగులతో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు కేఎల్ రాహుల్ రూపంలో ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన పుజారా 83 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరగా, ఓపెనర్ మురళీ విజయ్, కెప్టెన్ కోహ్లీ సెంచరీలు సాధించారు.

India Vs Bangladesh, Hyderabad Test Day 2: Kohli-Rahane eye big totalfor hosts

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో పుజారాకి ఇది 9వ టెస్టు సెంచరీ కాగా, కోహ్లీకి ఇది 16వ సెంచరీ కావడం విశేషం. ఇక బంగ్లా బౌలర్లలో అహ్మద్, మిరాజ్, ఇస్లాం తలో వికెట్ తీసుకున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+