తొలి టెస్టు హైలెట్స్: బంగ్లా 150 ఆలౌట్, తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 86/1

హైదరాబాద్: ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 26 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 64 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో మయాంక్ అగర్వాల్(37; 81 బంతుల్లో 6 ఫోర్లు), ఛటేశ్వర్ పుజారా(43; 61 బంతుల్లో 7 ఫోర్లు) ఉన్నారు.
అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా జట్టు స్కోరు 14 పరుగుల వద్ద ఓపెనర్ రోహిత్ శర్మ (6; 14 బంతుల్లో ఫోర్) అబు జయేద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

రోహిత్ శర్మ ఔట్ కావడంతో
రోహిత్ శర్మ ఔట్ కావడంతో హోల్కర్ స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. కాగా, ఇటీవలే సఫారీలతో ముగిసిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రోహిత్ శర్మ పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. అయితే, రోహిత్ శర్మ(6) పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

150 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. గురువారం తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్‌పై ఆద్యంతం టీమిండియాదే పైచేయిగా నిలిచింది. బంగ్లాదేశ్ జట్టులో ముష్ఫీకర్ రహీమ్(43; 105 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్)తో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ మోమినుల్ హక్(37; 80 బంతుల్లో 6 ఫోర్లు) ఫరవాలేదనిపించాడు.

12 పరుగులకే రెండు వికెట్లు
భారత బౌలర్ల ధాటికి 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు షాద్మాన్ ఇస్లాం(6), ఇమ్రుల్ కయాస్(6) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత మహ్మద్ షమి వేసిన 18వ ఓవర్ చివరి బంతికి మొహమ్మద్ మిథున్(13) ఎల్బీగా వెనుతిరిగాడు. దీంతో 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి బంగ్లా కష్టాల్లో పడింది.

లంచ్ విరామానికి 63/3
మొహమ్మద్ మిథున్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ రహీమ్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. దీంతో లంచ్ విరామ సమయానికి బంగ్లాదేశ్ నిర్ణీత 26 ఓవర్లలో3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. లంచ్ విరామం అనంతరం టీమిండియా పేసర్ మహ్మద్ షమి వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు.

ముష్ఫికర్ రహీమ్ క్లీన్‌బౌల్డ్
షమి వేసిన 54వ ఓవర్ ఐదో బంతికి తొలుత ముష్ఫికర్ రహీమ్(43) క్లీన్‌బౌల్డ్ కాగా, తర్వాతి బంతికే మెహెది హసన్(0) ఎల్బీగా వెనుదిరిగాడు. టీ విరామం అనంతరం ఇషాంత్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే లిటాన్ దాస్(21) ఔటయ్యాడు. దీంతో జట్టు స్కోరు 140 పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడు వికెట్లను కోల్పోవడం విశేషం.

140/5 నుండి 150కే ఆలౌట్
అనంతరం తైజుల్ ఇస్లామ్ రనౌట్ కాగా, చివరి వికెట్‌గా ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఇబాదత్ హుస్సేన్(2) ఔటయ్యాడు. ఈ రోజు ఆటలో లంచ్ సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లా.. టీ విరామానికి మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. 140/5 స్థితిలో ఉన్న బంగ్లాదేశ్ చివరి ఐదు వికెట్లను 10 పరుగుల తేడాతో కోల్పోయి 150 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా... రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, ఇశాంత్ శర్మ తలో రెండు వికెట్లు తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications