Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఢిల్లీ టీ20: తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. వేదిక మార్చాలని బీసీసీఐకి విజ్ఞప్తి!!

India vs Bangladesh: Environmentalists urge BCCI chief Sourav Ganguly to shift Delhi T20I

ఢిల్లీ: నవంబర్ 3న ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరగనున్న భారత్‌, బంగ్లాదేశ్‌ తొలి టీ20 మ్యాచ్‌పై సందిగ్ధత నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న వాయు కాలుష్య పరిస్థితుల కారణంగా ఈ మ్యాచ్ నిర్వహణపై పలు అనుమానాలు నెలకొన్నాయి. మ్యాచ్ పక్కాగా ఢిల్లీలోనే జరుగుతుందని బీసీసీఐ చెపుతున్నా.. ఆ సూచనలు మాత్రం కనబడడం లేదు. దీపావళి సందర్భంగా.. ప్రస్తుతం డిల్లీలో వాయు కాలుష్య స్థాయి మరింత పెరిగి గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది.

 వేదిక మార్చాలని విజ్ఞప్తి:

వేదిక మార్చాలని విజ్ఞప్తి:

బుధవారం గాలి నాణ్యత ప్రమాద స్థాయికి పడిపోయిందని ఢిల్లీ పర్యావరణవేత్తలు తెలిపారు. ఆటగాళ్లు ప్రమాద బారిన పడకుండా ఢిల్లీ వేదికను మార్చాలని అక్కడి పర్యావరణవేత్తలు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ఓ లేఖ రాశారు. 'దీపావళి సందర్భంగా ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం ఉంది. గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. తొలి టీ20 కోసం ఢిల్లీ వేదికను మార్చాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నాం. విషపూరిత గాలిలో ఇరు జట్లు 3-4 గంటలు క్రికెట్ ఆడుతారు కాబట్టి.. ఆటగాళ్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది' అని జ్యోతి పాండే, రవీనా రాజ్ కోహ్లీ పేర్కొన్నారు.

అందరూ ప్రమాదంలో పడతారు:

అందరూ ప్రమాదంలో పడతారు:

'మ్యాచ్ చూడటానికి వేలాది మంది ప్రేక్షకులు స్టేడియానికి వస్తారు. అందరూ ప్రమాదంలో పడతారు. శ్వాసకు సంబందించిన సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితులలో మ్యాచ్ ఆడడం చాలా కష్టం' అని ఢీల్లి పర్యావరణవేత్తలు చెప్పుకొచ్చారు. గతంలో ఢిల్లీలో ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఇక్కడ ఆడిన సందర్భాలు ఉన్నాయి. 2017, డిసెంబర్‌లో శ్రీలంక ఆటగాళ్లు ముఖానికి మాస్క్‌లు ధరించి ఆడారు. అయినా రెండు మూడు సార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.

షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్:

షెడ్యూల్‌ ప్రకారమే మ్యాచ్:

'మ్యాచ్‌కు ఇంకా సమయం ఉన్నందున.. మ్యాచ్ సమయానికి వాయు కాలుష్యం నియంత్రణలోకి వచ్చి షెడ్యూల్‌ ప్రకారమే ఆట జరుగుతుందని, అందులో ఎలాంటి మార్పులు లేవని మంగళవారం ఓ బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. అయితే బుధవారం గాలి నాణ్యత ప్రమాద స్థాయికి పడిపోవడంతో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

కాలుష్య ప్రభావం ఉండదు:

కాలుష్య ప్రభావం ఉండదు:

సోమవారం ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ... 'వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నవంబర్‌ 4 నుంచి సరి-బేసి విధానాన్ని కొనసాగిస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఇక్కడ క్రికెట్‌ మ్యాచ్‌లు జరగడం నేను చూశా. క్రికెట్‌కు కాలుష్యం అడ్డకింగా మారకూడదు' అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మూడు టీ20, రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Story first published: Wednesday, October 30, 2019, 14:47 [IST]
Other articles published on Oct 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+