ఈడెన్ గార్డెన్స్ గులాబీమయం: బీసీసీఐ ట్విట్టర్‌లో 17 సెకన్ల నిడివి వీడియో వైరల్

హైదరాబాద్: శుక్రవారం నుంచి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌కు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాలు ఎటువంటి ఏర్పాట్లు చేసిందో బుధవారం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసీసీఐ) ఓ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
నవంబర్ 22 నుంచి 26 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే తొలి డే నైట్ టెస్టుకు క్యాబ్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ డే నైట్ టెస్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్యాబ్ అంగరంగవైభవంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే కోల్‌కతాలోని వీధులన్నీ గులాబీ మయం అయ్యాయి.
డే నైట్ టెస్టు కోసం
డే నైట్ టెస్టు కోసం ఈడెన్ గార్డెన్స్‌ను క్యాబ్ ఏ విధంగా ముస్తాబు చేసిందో 17 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో క్లిప్ బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంటూ "పింక్ బాల్ టెస్టు కోసం కోల్‌కతా సిద్దమైంది" అనే కామెంట్ పోస్టు చేసింది. వీడియోలో ఈడెన్ గార్డెన్స్ గులాబీ రంగుతో అందంగా ముస్తాబైంది.

పింకు-టింకు అనే మస్కట్
పింక్ బాల్ టెస్ట్ కోసం ప్రత్యేకంగా పింకు-టింకు అనే మస్కట్‌ను రూపొందించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మైదానంలో పింక్ బెలూన్‌ను ఎగురవేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ అభిమానులు నగరంలో కనిపించిన గోడను గులాబీ గ్రాఫిటీలతో ముంచేశారు. ఇప్పటికే నాలుగు రోజుల టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి.

సౌరవ్ గంగూలీ సంతోషం
పింక్ బాల్ టెస్టుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం సంతోషం వ్యక్తం చేశాడు. డే నైట్ టెస్టులో ఇరు జట్ల కెప్టెన్లకు ఆర్మీ పారాట్రూపర్లు చేతుల మీదగా పింక్ బాల్‌ను అందజేయనున్నారు. ఈ విషయమై ఆర్మీ(ఈస్టర్న్ కమాండ్)తో చర్చించామని క్యాబ్ కార్యదర్శి అవిశేక్ దాల్మియా వెల్లడించారు.

పారాట్రూపర్లు చేతుల మీదుగా పింక్ బాల్
మ్యాచ్ జరగడానికి ముందు భారత ఆర్మీ ఇరు దేశాలకు చెందిన జాతీయ గీతాన్ని తమ బ్యాండ్స్‌తో ఆలపించనుంది. ఈ పింక్ బాల్ టెస్ట్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా రానున్నారు. వీరిద్దరూ ఈడెన్ గార్డెన్స్‌లోని గంట మోగించనున్నారు.

మధ్యాహ్నం 1 గంట మ్యాచ్ ప్రారంభం
మ్యాచ్‌ను మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమవుతుంది. తొలి సెషన్ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. లంచ్ విరామం నలభై నిమిషాలు, అనంతరం 3:40 గంటలకు ప్రారంభమయ్యే రెండో సెషన్ 5:40వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 20 నిమిషాలు టీ విరామం ఉంటుంది. ఆఖరి సెషన్ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది.

లంచ్ విరామంలో 'ఫ్యాబులెస్ ఫైవ్'తో ఓ టాక్ షో
లంచ్ విరామ సమయంలో 'ఫ్యాబులెస్ ఫైవ్'తో ఓ టాక్ షో కూడా ప్లాన్ చేశారు. సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్‌లను అభిమానులు ముద్దుగా 'ఫ్యాబులెస్ ఫైవ్' అని పిలుచుకునే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 'ఫ్యాబులెస్ ఫైవ్' క్రికెటర్లు 2001లో ఇదే మైదానంలో ఆస్ట్రేలియాపై సాధించిన చారిత్రక విజయంపై మాట్లాడనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications