ఈడెన్‌లో డే నైట్ టెస్ట్: పింక్ బాల్ టెస్ట్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరుపున ఐదువేల పరుగు మైలురాయిని అత్యంత అందుకున్న తొలి కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ మైలురాయిని అందుకుని కొత్త చరిత్ర సృష్టించాడు. పింక్ బాల్ టెస్టులో కోహ్లీ 32 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కి ముందు కెప్టెన్‌గా టెస్టుల్లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి 32 పరుగులు దూరంలో ఉన్నాడు.

టెస్టుల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని
భారత్ తరుపున ఇప్పటివరకు 52 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కోహ్లీ 4,968 పరుగులు చేశాడు. తాజాగా, పింక్ బాల్ టెస్టులో కోహ్లీ 32 పరుగులు చేయడంతో టెస్టుల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న కెప్టెన్ల జాబితాలో చేరాడు. అంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది.

86 ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ ఈ ఘనత
ఒక కెప్టెన్‌గా ఐదు వేల టెస్టు పరుగులు చేయడానికి పాంటింగ్ 97 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా కోహ్లీ 86 ఇన్నింగ్స్‌లే తీసుకున్నాడు. మొత్తంగా కోహ్లీకి ఇది 84వ టెస్టు కాగా 7,100 పరుగులు పైగా చేశాడు. దీంతో భారత్ తరుపున ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.

ఆరో క్రికెటర్‌గా
దీంతో పాటు కెప్టెన్‌గా ఐదువేల టెస్టు పరుగులు చేసిన ఆరో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్(97 ఇన్నింగ్స్‌లు), క్లైవ్ లాయిడ్(106 ఇన్నింగ్స్‌లు), గ్రేమ్ స్మిత్(110 ఇన్నింగ్స్‌లు), అలెన్ బోర్డర్(116 ఇన్నింగ్స్‌లు), స్టీఫెన్ ఫ్లెమింగ్(130 ఇన్నింగ్స్‌లు)లు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications