Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డే నైట్ టెస్టు రాత్రి 8 గంటల వరకే!: టైమింగ్స్, ఎలా వీక్షించాలి తదితర వివరాలు!

India vs Bangladesh Pink Ball Test : All You Need To Know About The Day-Night Match || Oneindia
 India vs Bangladesh Day-Night Test: Timing, start and end time, when & where to watch, live telecast on TV, live stream

హైదరాబాద్: చారిత్రాత్మక డే నైట్ టెస్టు సిరిస్‌కు సర్వం సిద్ధమైంది. నవంబర్ 22 నుంచి 26 వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే తొలి డే నైట్ టెస్టుకు అటు బీసీసీఐతో పాటు ఇటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ డే నైట్ టెస్టుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్యాబ్ అంగరంగవైభవంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పింక్ బాల్ టెస్ట్ కోసం ప్రత్యేకంగా పింకు-టింకు అనే మస్కట్‌ను రూపొందించింది. ఈ టెస్ట్ కోసం కోల్‌కతాలోని వీధులన్నీ గులాబీ మయం అయ్యాయి.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మైదానంలో పింక్ బెలూన్‌ను ఎగురవేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ అభిమానులు నగరంలో కనిపించిన గోడను గులాబీ గ్రాఫిటీలతో ముంచేశారు. ఈ పింక్ బాల్ టెస్ట్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మ్యాచ్‌కు రానున్నారు.

తొలిరోజు వీరిద్దరూ గంటను మోగించి ఆటను ప్రారంభించనున్నారు. ఇప్పటికే తొలి మూడు రోజుల టికెట్లు మొత్తం అమ్ముడు పోయాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడంటే ఈ మ్యాచ్‌కు ఎంత క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పింక్ బాల్ టెస్టు గురించి సమాచారం మీకోసం...

డే నైట్ టెస్టు ఎప్పుడు జరుగుతుంది?

డే నైట్ టెస్టు ఎప్పుడు జరుగుతుంది?

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో నవంబర్ 22 నుంచి 26వ తేదీ వరకు ఈ డే నైట్ టెస్టు జరగనుంది. 1987లో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌కి ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిచ్చింది. అలెన్ బోర్డర్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ బయట జరిగిన తొలి వరల్డ్‌కప్ ఫైనల్ ఇదే. అంతకముందు లార్డ్స్ వరుసగా 1975, 1979, 1983 వరల్డ్‌కప్ పైనల్స్‌కు ఆతిథ్మమిచ్చింది. మొదటి ఆసియా టెస్టు ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌ ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరిగింది. ఈ మ్యాచ్‌లో కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు నమోదయ్యాయి. 1999లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు విజేతగా నిలిచింది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లకు పాకిస్థాన్ మాజీ పేసర్ వేసిన బంతులు క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తే.

డే నైట్ టెస్టు టైమింగ్

డే నైట్ టెస్టు టైమింగ్

మ్యాచ్‌ను మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమవుతుంది. తొలి సెషన్‌ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. లంచ్ విరామం నలభై నిమిషాలు, అనంతరం 3:40 గంటలకు ప్రారంభమయ్యే రెండో సెషన్‌ 5:40వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 20 నిమిషాలు టీ విరామం ఉంటుంది. ఆఖరి సెషన్‌ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది.

లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్

లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్

భారత్-బంగ్లాదేశ్ చారిత్రాత్మక డే నైట్ టెస్ట్ మ్యాచ్‌‌ని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షంగా వీక్షించొచ్చు. ఇక, హాట్ స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

మొదటి మూడు రోజులు హౌస్‌‌ఫుల్

మొదటి మూడు రోజులు హౌస్‌‌ఫుల్

డే నైట్ టెస్టుకు సంబంధించిన మొదటి మూడు రోజుల టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న డే నైట్ టెస్టు మ్యాచ్ కోసం బెంగాల్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌కు అతిథులుగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో పాటు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో వీవీఐపీల భద్రతను దృష్టిలో పెట్టుకుని స్టేడియానికి వచ్చే రహదారులతో పాటు పరిసర పాంత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Story first published: Wednesday, November 20, 2019, 12:36 [IST]
Other articles published on Nov 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+