Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈడెన్‌లో సౌరవ్ గంగూలీ సెల్ఫీనే చెబుతోంది పింక్ బాల్ టెస్ట్ సక్సెస్ అయిందని!

India Vs Bangladesh,Day-Night Test : Sourav Ganguly Captures Tremendous Atmosphere At Eden Gardens
 India vs Bangladesh, Day-Night Test: Sourav Ganguly Captures Tremendous Atmosphere At Eden For The Pink Test

హైదరాబాద్: భారత్‌లో తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చి ఈడెన్ గార్డెన్స్ చరిత్ర సృష్టించింది. తొలిరోజు ఆటకు సుమారు ల‌క్ష మందికిపైగా ప్రేక్ష‌కుల‌ు హాజరయ్యారు. పింక్‌బాల్‌ టెస్ట్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన క్రికెట్‌ అభిమానులు, ప్రముఖులతో ఈడెన్‌ గార్డెన్స్‌లో సందడి వాతావరణం నెలకొంది.

ఈ డే నైట్ టెస్టు నిర్వ‌హ‌ణ‌లో కీల‌క పాత్ర పోషించిన బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ సైతం తెగ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆ మ‌ధుర స్మృతుల‌ను గంగూలీ త‌న సెల్ఫీలో బంధించారు. ప్రేక్ష‌కుల‌తో కిక్కిరిసిపోయిన ఈడెన్ స్టాండ్స్‌లోని అభిమానులతో దాదా సెల్ఫీ దిగాడు. ఆ సెల్ఫీని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు.

తొలి డే నైట్ టెస్టుకు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చిదంటూ ఆ పోస్టుకు కామెంట్‌ను కూడా పెట్టాడు. భారత్‌లో తొలి డే నైట్ టెస్టు జరగడంలో దాదా పాత్ర మరువలేనిది. అతి తక్కువ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లతో పాటు ఆయా బోర్డులను ఒప్పించండలో దాదా సఫలమయ్యారు.

అంతేకాదు ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కి బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనాను సైతం ఆహ్వానించారు. కోల్‌కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ స్టేడియానికి వెళ్లి మరీ ఆమెకు ఘన స్వాగతం పలికారు. తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా హాజరైన బంగ్లా ప్రధాని షేక్ హసీన, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు అడుగడుగునా మర్యాద ఇచ్చారు.

మ్యాచ్‌కు ముందు రెండు దేశాల జాతీయ గీతాలాపన ముగిశాక వీరిద్దరి చేత సంయుక్తంగా గంట మోగించేలా చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, బెంగాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇరు జట్ల ఆటగాళ్లను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పరిచయం చేశాడు.

ఆ తర్వాత పేరుపేరునా జట్టు సభ్యులు, కోచ్‌, సహాయ కోచ్‌లను కోహ్లీ ఆమెకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా బంగ్లా ప్రధాని షేక్ హసీనా, మమతా బెనర్జీ ఆటగాళ్లతో ముచ్చటించారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ కోసం ప్రత్యేకంగా బంగారు నాణెం తయారు చేయించడం గమనార్హం.

భారత్‌లో జరుగుతున్న ఈ తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ కోసం గంగూలీ ప‌డ్డ శ్ర‌మ‌ను క్రికెట్ అభిమానులు గుర్తించారు. తొలి డే నైట్ టెస్టు విజయవంతం కావడంతో సౌరవ్ గంగూలీ కొంద‌రు నెటిజన్లు త‌మ ట్వీట్ల‌తో ధన్యవాదాలు చెప్పారు. భార‌త క్రికెట్‌లో ఇది చ‌రిత్రాత్మ‌క రోజని కొనియాడుతున్నారు.

ప్రస్తుతం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న డే నైట్ టెస్టు 12వది కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి డే నైట్ టెస్టు మ్యాచ్ 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. అంతర్జాతీయ క్రికెట్‌లో డే నైట్ టెస్టు ఆడిన 9, 10వ జట్లుగా భారత్, బంగ్లాదేశ్‌లు నిలిచాయి.

ఈ డే నైట్ టెస్టు మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటకి ప్రారంభమై తొలి సెషన్‌ మధ్యాహ్నం మూడు గంటలకు ముగుస్తుంది. లంచ్ విరామం నలభై నిమిషాలు. అనంతరం 3:40 గంటలకు ప్రారంభమయ్యే రెండో సెషన్‌ 5:40వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 20 నిమిషాలు టీ విరామం ఉంటుంది. ఆఖరి సెషన్‌ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది.

Story first published: Friday, November 22, 2019, 19:52 [IST]
Other articles published on Nov 22, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+