న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పింక్ బాల్ టెస్ట్: రోహిత్ శర్మ సూపర్ మ్యాన్‌గా మారిన వేళ (వీడియో)

IND vs BAN,2nd Test : Rohit Sharma Stunning Catch To Dismiss Kayes ! || Oneindia Telugu
India Vs Bangladesh, Day-Night Test: Rohit Sharma turns superman to pluck one-handed stunner at slip

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్ మ్యాన్ అయ్యాడు. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో సెకండ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్‌తో అదరగొట్టాడు.

ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 11 ఓవర్‌ తొలి బంతిని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ డిఫెన్స్‌ ఆడబోయాడు. అది కాస్తా ఎడ్జ్‌ తీసుకుని స్లిప్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తోన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ క్యాచ్‌ను అందుకునేందుకు సిద్దమయ్యాడు. అయితే, అంతకముందే రోహిత్‌ శర్మ అమాంతం డైవ్‌ కొట్టి మరీ క్యాచ్ పట్టాడు.

<strong>టాస్‌కు గోల్డ్ కాయిన్: తొలి పింక్ బాల్ టెస్ట్‌కు కోల్‌కతా నగరం ఎలా ముస్తాబైందో తెలుసా?</strong>టాస్‌కు గోల్డ్ కాయిన్: తొలి పింక్ బాల్ టెస్ట్‌కు కోల్‌కతా నగరం ఎలా ముస్తాబైందో తెలుసా?

ఆశ్చర్యపోయిన కోహ్లీ

దీంతో కోహ్లీ సైతం ఆశ్చర్యపోయాడు. దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినుల్ హక్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ పట్టిన ఈ క్యాచ్ జట్టులోని మిగతా సహచర ఆటగాళ్లలో జోష్‌ను నింపింది. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ఫేస్‌బుక్ పేజిలో అభిమానులతో పంచుకుంది.

లంచ్ విరామ సమయానికి బంగ్లా 73/6

కాగా, తొలిరోజు లంచ్‌ విరామ సమయానికి బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లిట్టన్ దాస్(24), నయిమ్ హాసన్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ను భారత పేసర్లు కోలుకోలేని దెబ్బతీశారు. మ్యాచ్ ఆరంభం నుంచే పేసర్లు రెచ్చిపోయారు.

ముగ్గురు బ్యాట్స్‌మన్ డకౌట్

దీంతో బంగ్లాదేశ్‌లోని ముగ్గురు బ్యాట్స్‌మన్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. బంగ్లా ఓపెనర్ షాద్‌మన్‌ ఇస్లామ్‌(29) ఫర్వాలేదనిపించగా... మరో ఓపెనర్ ఇమ్రుల్‌(4) నిరాశపరిచాడు. మిగతా నలుగురు దారుణంగా విఫలమయ్యారు. మోమినుల్‌, మహ్మద్‌ మిథున్‌, ముష్పికర్‌ రహీమ్‌లు డకౌట్ అయ్యారు.

మూడు వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్

బంగ్లాదేశ్ కోల్పోయిన ఆరు వికెట్లలో ఉమేశ్ యాదవ్ 3, ఇషాంత్ శర్మ 2 వికెట్లు తీయగా షమీకి ఒక వికెట్ లభించింది.

Story first published: Friday, November 22, 2019, 15:55 [IST]
Other articles published on Nov 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X