న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన ఆర్మీ: అమిత్ షా సైతం, గౌరవ పరేడ్ విశేషాలివే!

India vs Bangladesh, Day/Night Test: No Army paratroopers for handing over pink ball to captains

హైదరాబాద్: చారిత్రాత్మక పింకా బాల్ టెస్ట్‌కు ఈడెన్ గార్డెన్స్ ముస్తాబైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చారిత్రాత్మక డే నైట్ టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ పింక్ బాల్ టెస్ట్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కోల్‌కతా అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అందుకు తగ్గ ఏర్పాట్లు చేసింది.

ఇందులో భాగంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల కెప్టెన్లకు పింక్‌ బాల్‌ అందిచడానికి ఆర్మీ పారాట్రూప్స్‌ను తీసుకొస్తున్నామని క్యాబ్ సెక్రటరి అవిశేక్ దాల్మియా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆర్మీ(ఈస్టర్న్ కమాండ్)తో చర్చించామని కూడా ఒక సమావేశంలో వెల్లడించాడు.

రోహిత్‌కు విశ్రాంతి లేదు, భువీ పునరాగమనం: వెస్టిండిస్‌తో తలపడే భారత జట్టిదేరోహిత్‌కు విశ్రాంతి లేదు, భువీ పునరాగమనం: వెస్టిండిస్‌తో తలపడే భారత జట్టిదే

భద్రతా కారణాల రీత్యా

భద్రతా కారణాల రీత్యా

మ్యాచ్ జరగడానికి ముందు భారత ఆర్మీ ఇరు దేశాలకు చెందిన జాతీయ గీతాన్ని తమ బ్యాండ్స్‌తో ఆలపిస్తాయని కూడా తెలిపారు. అయితే, భద్రతా కారణాల రీత్యా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు పింక్ బాల్ టెస్టు ఆరంభానికి ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హాజరుకానున్నట్లు వార్తలు వచ్చాయి.

అమిత్ షా రావడం లేదు

అమిత్ షా రావడం లేదు

అయితే, డే నైట్ టెస్టుకు అమిత్ షా రావడం లేదని సమాచారం. పశ్చిమ్‌ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాలు మాత్రమే ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. వీరిద్దరూ సంయుక్తంగా గంట మోగించి మ్యాచ్‌ని అధికారికంగా ప్రారంభిస్తారు. మ్యాచ్‌ మొదలై, తొలి సెషన్‌ పూర్తయ్యాక మధ్యాహ్నం 3 గంటలకు లంచ్ బ్రేక్ ఉంటుంది.

లంచ్ విరామ సమయంలో

లంచ్ విరామ సమయంలో

లంచ్ విరామ సమయంలో 'ఫ్యాబులెస్ ఫైవ్'తో ఓ టాక్ షోని క్యాబ్ ప్లాన్ చేసింది. సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్‌లను అభిమానులు ముద్దుగా 'ఫ్యాబులెస్ ఫైవ్' అని పిలుచుకునే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 'ఫ్యాబులెస్ ఫైవ్' క్రికెటర్లు 2001లో ఇదే మైదానంలో ఆస్ట్రేలియాపై సాధించిన చారిత్రక విజయంపై మాట్లాడనున్నారు.

ఆడియన్స్‌కు వీరి మాటలు స్పష్టంగా వినపడేలా

ఆడియన్స్‌కు వీరి మాటలు స్పష్టంగా వినపడేలా

'ఫ్యాబులెస్ ఫైవ్' చాట్ షోను మైదానంలో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్లపై ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. ఆడియన్స్‌కు వీరి మాటలు స్పష్టంగా వినపడేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అవిశేక్ దాల్మియా తెలిపారు. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆడిన క్రికెటర్లను సన్మానించనున్నారు.

భారత మాజీ ఆటగాళ్లకు క్యాబ్ సన్మానం

భారత మాజీ ఆటగాళ్లకు క్యాబ్ సన్మానం

ఈ జాబితాలో భారత్ నుంచి మాజీ ఆటగాళ్లు ఎస్‌. రమేశ్‌, సబా కరీమ్‌, సునీల్‌ జోషి, అజిత్‌ అగార్కర్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, కపిల్‌దేవ్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, అజహరుద్దీన్‌, శ్రీకాంత్‌, ఫరూక్‌ ఇంజినీర్‌, చందు బోర్డే ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్ నుంచి నైముర్‌ రహ్మాన్‌, మహ్మదుల్‌ హసన్‌, మహరబ్‌ హుస్సేన్‌, మొహమ్మద్‌ హాసీబుల్‌ హుస్సేన్‌, షాహ్రియర్‌ హొసేన్‌, కాజీ హబిబుల్‌ బషర్‌, మహ్మద్‌ అక్రమ్‌ ఖాన్‌ హాజరవుతున్నారు.

ఈడెన్ గార్డెన్స్‌లో గౌరవ పరేడ్‌

ఈడెన్ గార్డెన్స్‌లో గౌరవ పరేడ్‌

వీరితో పాటు భారత్‌లోని భారత క్రీడాకారులు అభినవ్‌ బింద్రా, పుల్లెల గోపీచంద్‌, పీవీ సింధు, సానియా మీర్జాలను కూడా క్యాబ్ సన్మానించనుంది. 20 నిమిషాల టీ విరామంలో మాజీ కెప్టెన్లు మరియు ఇతర విభాగాలకు చెందిన క్రీడాకారులతో ఈడెన్ గార్డెన్స్‌లో గౌరవ పరేడ్‌ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా బౌండరీ లైన్ చుట్టూ బండ్లపై వీళ్లను తిప్పనున్నారు.

Story first published: Friday, November 22, 2019, 11:19 [IST]
Other articles published on Nov 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X