డే నైట్ టెస్టులో గుబాలీ బంతిపై ఇషాంత్ అనుభవం ఇదీ

హైదరాబాద్: ఎర్ర బంతితో పోలిస్తే గులాబీ బంతికి చాలా తేడా కనిపించిందని టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన తొలి పింక్ బాల్ టెస్టులో ఇషాంత్ శర్మ చెలరేగిపోయాడు. తన పదునైన బంతులతో ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు.
ఈ క్రమంలో తొలి పింక్ బాల్ టెస్టులో ఇషాంత్ శర్మ(5/22) సరి కొత్త చరిత్ర సృష్టించాడు. డే నైట్ టెస్టులో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించిన భారతీయ బౌలర్‌గా నిలిచాడు. 2007 తర్వాత స్వదేశంలో ఇషాంత్ శర్మ ఈ ఘనత సృష్టించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ఇషాంత్ శర్మ మాట్లాడాడు.

ఎర్ర బంతితో పోలిస్తే
"ఎర్ర బంతితో పోలిస్తే పింక్ బాల్‌కు చాలా తేడా కనిపించింది. ఆరంభంలో సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేశాం కానీ బంతి మాత్రం స్వింగ్ కాలేదు. అప్పుడు మేమందరం చర్చించుకున్న తర్వాత పింక్ బాల్‌తో ఎలాంటి లెంగ్త్‌తో బౌలింగ్ చేయాలనేది అర్థమైంది. పరిమిత ఓవర్ల జట్టుకు దూరమయ్యాననే బెంగ ఏమాత్రం లేని దశకు చేరుకున్నాను" అని ఇషాంత్ అన్నాడు.

ఏ ఫార్మాట్ అయినా ఆడాలని
ఏ ఫార్మాట్ అయినా ఆడాలని, ఆటను ఆస్వాదించాలని మాత్రమే కోరుకుంటానని ఇషాంత్ శర్మ చెప్పుకొచ్చాడు. తొలి డే నైట్ టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (59 బ్యాటింగ్; 8 ఫోర్లు), రహానే (23; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.

68 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
భారత్‌కు ఇప్పటికే 68 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా, పుజారా(105 బంతుల్లో 55; 8 ఫోర్లు)తో కలిసి విరాట్ కోహ్లీ మూడో వికెట్‌కు 94 పరుగులు జోడించడం విశేషం. అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ భారత బౌలర్ల దెబ్బకు 30.3 ఓవర్లలోనే 106 పరుగులకు కుప్పకూలింది.

నలుగురు బ్యాట్స్‌మన్ డకౌట్
షాద్‌మన్ ఇస్లామ్ (29), లిటన్ దాస్ (24 రిటైర్డ్ హర్ట్), నయీమ్ హసన్ (19) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగతా వారంతా నిరాశపరిచారు. నలుగురు బ్యాట్స్‌మన్ డకౌట్ కావడం విశేషం. టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ 22 పరుగులకే 5 వికెట్లు పడగొట్టగా... ఉమేశ్‌కు 3, షమీకి 2 వికెట్లు దక్కాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications