For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షకీబ్‌పై నిషేధం: బంగ్లాకు కొత్త సారథులు.. టీ20, టెస్ట్ జట్లు ఇవే

India vs Bangladesh: BCB announces Test squad and revised T20 squad for India tour

ఢాకా: బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌, కెప్టెన్ షకీబ్‌ అల్‌ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించింది. ఫిక్సింగ్‌ చేసేందుకు తనను కొందరు బుకీలు సంప్రదించిన సమయంలో అవినీతి నిరోధక బృందానికి షకీబ్‌ సమాచారం ఇవ్వకపోవడంతో అతనిపై ఐసీసీ వేటు వేసింది. 2018లో జరిగిన రెండు టోర్నీల సందర్భంగా షకీబ్‌ను బుకీ సంప్రదించాడు. ఈ నేపథ్యంలో షకీబ్‌పై ఐసీసీ మూడు వేర్వేరు ఆరోపణలు చేసింది. అతను తన తప్పు అంగీకరించడంతో శిక్ష విధించింది.

బంగ్లాకు కొత్త సారథులు:

బంగ్లాకు కొత్త సారథులు:

భారత్‌లో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడే జట్లను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. 16 మంది సభ్యుల టెస్ట్ జట్టు మరియు సవరించిన టీ20 జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ షకీబ్‌పై ఐసీసీ నిషేధం విధించడంతో భారత పర్యటనలో కొత్త సారథులు బంగ్లా జట్టును నడిపించనున్నారు. బంగ్లాదేశ్ టీ20 జట్టుకు మహ్ముదుల్లా రియాద్, టెస్టులకు మోమినుల్ హక్ సారథులుగా ఎంపికయ్యారు. ఇద్దరికీ సారథ్యం ఇదే మొదటిసారి.

 షకీబ్ స్థానంలో తైజుల్:

షకీబ్ స్థానంలో తైజుల్:

టీ20 సిరీస్‌కు షకీబ్ స్థానంలో యువ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్, మహమ్మద్ సైఫుద్దీన్ గైర్హాజరీతో మహమ్మద్ మిథున్, ఇమ్రుల్ కైస్ టీ20 జట్టులో పునరాగమనం చేశారు. వన్డే జట్టుకు సీనియర్ బౌలర్ మష్రాఫె మోర్తజా సారథిగా ఉన్న విషయం తెలిసిందే. టీ20, టెస్టు జట్టులో మోర్తజాకు స్థానం లభించలేదు.

కోల్‌కతాలో డే-నైట్ టెస్ట్‌:

కోల్‌కతాలో డే-నైట్ టెస్ట్‌:

భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ టీ20, టెస్ట్ సిరీస్ ఆడనుంది. టీ20ల సిరీస్‌లో భాగంగా నవంబర్‌ 3న ఢిల్లీ వేదికగా బంగ్లాతో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అనంతరం రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా 14 నుండి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు 22 నుంచి రెండో టెస్టు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆడాల్సి ఉంది. 22 నుంచి 26వ తేదీ మధ్య కోల్‌కతాలో డే-నైట్ టెస్ట్‌ మ్యాచ్ జరగనుంది.

T20I Squad:

Taijul Islam, Mohammad Mithun, Liton Kumer Das, Soumya Sarker, Naim Sheikh, Mushfiqur Rahhim, Mahmudullah Riyad (cap), Afif Hossain, Mosaddek Hossain Saikat, Aminul Islam Biplob, Arafat Sunny, Abu Hider, Al-Amin Hossain, Mustafizur Rahman, Shafiul Islam.

Test Squad:

Shadman Islam, Imrul Kayes, Saif Hassan, Mominul Haque (Cap), Liton Kumar, Mushfiqur Rahim, Mahmudullah Riyad, Mohammad Mithun, Mosaddek Hossain, Mehedi Hasan Miraz, Taijul Islam, Nayeen Hasan, Mustafizur Rahman, Al Amain Hossain, Abu Jayed, Ebadot Hossain.

Story first published: Wednesday, October 30, 2019, 8:28 [IST]
Other articles published on Oct 30, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+