
షకీబ్ లేకుండా టీ20 జట్టు
బుధవారం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ యాజమాన్యం షకీబ్ లేకుండా తాజా టీ20 జట్టును ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. 'మంగళవారం టీ20 జట్టును ప్రకటిస్తాం. టెస్ట్ జట్టును ప్రకటించడానికి మాత్రం కొంత సమయం కావాలి. రెండు మూడు రోజుల తరువాత టెస్ట్ జట్టును ప్రకటిస్తాం' అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ అక్రమ్ ఖాన్ ఓ స్పోర్ట్స్ ఛానెల్ ఇంటర్వ్యూలో తెలిపాడు.

కీలక సమావేశంకు షకీబ్ డుమ్మా
భారత పర్యటనకు ముందు వ్యూహాలను చర్చించడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో షకీబ్ పాల్గొనలేదు. కీలక ప్రాక్టీస్ సెషన్, సమావేశంకు షకీబ్ డుమ్మా కొట్టడంతో బీసీబీ అతనిపై గుర్రుగా ఉన్నట్లు బంగ్లా బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ రోజు సాయంత్రంలోగా బీసీబీ టీ20 జట్టును ప్రకటించనుంది. మరి షకీబ్ జట్టులో ఉంటాడో లేదో చూడాలి.

షోకాజ్ నోటీసు
తొలుత కాంట్రాక్ట్ విషయంలో సహచరులతో కలిసి సమ్మెకు నాయకత్వం వహించిన షకీబ్.. ఆ తర్వాత తన వ్యక్తిగత స్పాన్సర్ ఒప్పందం విషయంలో కూడా బోర్డుతో తలపడాల్సి వచ్చింది. టెలికామ్ సంస్థ రోబీ బంగ్లా జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఉండగా.. ప్రత్యర్థి అయిన గ్రామీన్‌ఫోన్‌కు షకీబ్ ప్రచారకర్తగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు. దీనిపై బోర్డు షోకాజ్ నోటీసు జారీ చేయగా.. షకీబ్ ఇప్పటి వరకు స్పందించలేదు.

కావాలనే వివాదాలు
షకీబ్‌తో పాటు మరికొందరు క్రికెటర్లు కావాలనే వివాదాలు చేస్తూ.. జట్టును దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నారని బంగ్లా బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరీస్‌లో ఆడేందుకు సిద్ధమైన ఆటగాళ్లు కూడా చివరి నిమిషంలో తప్పుకునే ప్రమాదం ఉన్నట్లు తనకు అనిపిస్తోందన్న హసన్ పేర్కొన్నారు. షకీబ్ పేరును ఆయన ప్రత్యేకంగా చెప్పారు. దీంతో భారత పర్యటనకు షకీబ్ దాదాపు దూరం అయినట్టే.


Click it and Unblock the Notifications
