న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh: భారత్‌తో టీ20 సిరీస్.. బంగ్లాదేశ్ జట్టు ఇదే!!

IND vs BAN 2019 : Bangladesh Announce Squad For India T20I Series || Oneindia Telugu
India vs Bangladesh: Bangladesh Announce Squad For Three Match T20I Series

ఢాకా: నవంబర్‌లో భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును గురువారం ప్రకటించింది. బంగ్లాదేశ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ షకీబుల్ హసన్ టీ20 సిరీస్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. స్వదేశంలో ఇటీవల ముగిసిన ముక్కోణపు టోర్నీకి వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న సీనియర్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ జట్టులోకి పునరాగమనం చేసాడు.

డచ్‌ ఓపెన్‌.. ప్రిక్వార్టర్స్‌లోనే సింధు, ప్రణీత్‌ నిష్క్రమణ!!డచ్‌ ఓపెన్‌.. ప్రిక్వార్టర్స్‌లోనే సింధు, ప్రణీత్‌ నిష్క్రమణ!!

మూడేళ్ల తర్వాత సన్నీ, హుస్సేన్‌లకు చోటు:

మూడేళ్ల తర్వాత సన్నీ, హుస్సేన్‌లకు చోటు:

స్పిన్నర్‌ అరాఫత్‌ సన్నీ, పేసర్ అల్‌అమీన్‌ హుస్సేన్‌లకు బంగ్లాదేశ్‌ సెలక్టర్ల నుంచి పిలుపొచ్చింది. దాదాపు మూడేళ్ల తర్వాత వీరు జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిద్దరు ఆఖరిగా 2016 టీ20 ప్రపంచకప్‌లో ఆడారు. భారత్‌ వేదికగా జరిగిన పొట్టి సమరంలో సన్నీ బౌలింగ్‌ యాక్షన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఫిర్యాదు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తన ప్రియురాలి వ్యక్తిగత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన ఆరోపణలను ఎదుర్కొన్న అతడు 2017లో అరెస్టు అయ్యాడు. రెండు నెలల జైలు జీవితం కూడా గడిపారు.

నవంబర్ 3న తొలి టీ20:

నవంబర్ 3న తొలి టీ20:

మరోవైపు ముక్కోణపు టోర్నీ జట్టులో ఉన్న బ్యాట్స్‌మెన్ సబ్బీర్ రెహ్మాన్, నజ్ముల్ హుస్సేన్.. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం, పేసర్ రుబెల్ హుస్సేన్‌లపై వేటు వేసి సన్నీ, హుస్సేన్‌లకు సెలెక్టర్లు చోటు కల్పించారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో (ఫిరోజ్ షా కోట్లా) నవంబర్ 3న భారత్-బంగ్లా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది.

ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాకు తొలి టెస్టు:

ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాకు తొలి టెస్టు:

రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మిగతా రెండు మ్యాచ్‌లు నవంబర్ 7, 10 తేదీల్లో జరగనున్నాయి. అనంతరం ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌ జరగనుంది. నవంబర్‌ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌ గార్డెన్స్‌లో ఆతిథ్యమివ్వనుంది. అయితే చారిత్రాత్మక మైదానమైన ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌కు ఇది తొలి టెస్టు.

బంగ్లాదేశ్‌ టీ20 జట్టు:

బంగ్లాదేశ్‌ టీ20 జట్టు:

షకిబ్‌ అల్‌ హసన్‌ (కెప్టెన్), తమీమ్‌ ఇక్బాల్, లిటన్ దాస్, సర్కార్‌, రహిమ్‌, మహ్మదుల్లా, మహమ్మద్‌ నయీమ్‌, అఫిప్‌ హుస్సేన్ మొసద్దేక్‌ హుస్సేన్‌, అమినుల్‌ ఇస్లామ్‌, అరాఫత్‌ సన్నీ, మహమ్మద్‌ సైఫుద్దీన్‌, అమినుల్‌ ఇస్లామ్‌, అల్‌అమిన్ హుస్సేన్‌, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్, షఫీల్‌ ఇస్లామ్‌.

Story first published: Friday, October 18, 2019, 9:55 [IST]
Other articles published on Oct 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X