ప్రపంచకప్‌లో భారత్ Vs బంగ్లా రికార్డు 2-1: ఓటమిని సమం చేసేనా?

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం భారత్-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఈ ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో మంగళవారం బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌ని కోహ్లీసేన ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమిండియా రెండింట విజయం సాధించగా.. బంగ్లా ఒక మ్యాచ్‌లో విజయం సాధించింది. 2007లో పసికూనగా ఉన్న బంగ్లా.. టీమిండియాపై విజయం సాధించి గ్రూప్ దశలోనే నిష్క్రమించేలా చేసింది.
అందుకు ప్రతీకారంగా 2011, 2015 ప్రపంచకప్‌లలో ధోనీ నేతృత్వంలోని టీమిండియా బంగ్లాదేశ్‌ను ఓడించింది. ప్రస్తుతం టీమిండియా ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దు అయింది. మంగళవారం నాటి మ్యాచ్‌పై బంగ్లాపై గెలిస్తే 13 పాయింట్లతో సెమీస్ చేరుతుంది.

ఈ మ్యాచ్‌లో ఓడిపోతే
ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోతే తదుపరి శ్రీలంకపై తప్పక విజయం సాధించాల్సి ఉంటుంది. మరోవైపు బంగ్లాదేశ్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించి... 3 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దు అయింది. ప్రస్తుతం 7 పాయింట్లతో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఆరో స్థానంలో కొనసాగుతుంది. బంగ్లాదేశ్ కూడా టోర్నీలో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో బంగ్లా తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు ఇది ఎంతో కీలక మ్యాచ్‌గా మారింది.

2007లో టీమిండియాను ఓడించిన బంగ్లాదేశ్
రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా 2007 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. హబీబుల్ బషర్ కెప్టెన్సీలోని బంగ్లా జట్టు 5 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించడంతో ఈ మెగా టోర్నీలో లీగ్ స్టేజి నుంచే భారత్ నిష్క్రమించింది. ఈ విజయం బంగ్లా క్రికెట్ చరిత్రలో నిలిస్తే.. భారత క్రికెట్‌లో చీకటి రోజుగా మిగిలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.3 ఓవర్లలో 191 పరుగులు చేయగా... భారత జట్టులో సౌరవ్ గంగూలీ(66), యువరాజ్ సింగ్(47) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. అనంతరం బంగ్లా జట్టు 48.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

2011లో ప్రపంచకప్‌లో టీమిండియా అలవోక విజయం
2011 ప్రపంచకప్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. సెహ్వాగ్(175), కోహ్లీ (100 నాటౌట్) సెంచరీలతో చెలరేగారు. లక్ష్య ఛేదనలో గట్టిగానే పోరాడినా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో మునాఫ్ పటేల్ తొలిసారి ప్రపంచకప్‌లో నాలుగు వికెట్లు తీశాడు. దీంతో టీమిండియా 87 పరుగుల తేడాతో విజయం సాధించింది.

2015లో కూడా
2015 ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో ఇరు జట్ల తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 109 పరుగులతో విజయం సాధించడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ సెంచరీతో రాణించగా టీమిండియా 302 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 45 ఓవర్లకే ఆలౌటై 193 పరుగులు చేశారు.
{headtohead_cricket_3_10}
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications