Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-బంగ్లాల మధ్య ఆసియాకప్ ఫైనల్: మ్యాచ్ టైమింగ్, టీవీ ఛానల్ ఇన్ఫో

India Vs Bangladesh, Asia Cup 2018 Final: Squads, Timings, TV Channel Information

హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీ సూపర్-4లో పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్‌ షాకిచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 37 పరుగుల తేడాతో విజయం సాధించి ఆసియా కప్‌ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో శుక్రవారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో భారత్‌తో తలపడనుంది.

ఓ మాదిరి లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాక్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 240 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసింది. గత నాలుగేళ్లలో బంగ్లాదేశ్ జట్టు ఆసియా కప్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.

టోర్నీకి ముందు పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించడం విశేషం. ఆసియా కప్ ఫైనల్ భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతుందని భావించిన అభిమానులకు ఇది షాకే. 2016లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో తలపడిన భారత్-బంగ్లాదేశ్‌లు మరోసారి టైటిల్ కోసం పోటీపడుతున్నాయి.

2016 ఫైనల్స్‌లో బంగ్లాదేశ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఈసారి ఎలాగైనా ఆసియా కప్‌ను నెగ్గాలనే గట్టి పట్టుదలతో మోర్తాజా సేన ఉంది. మొత్తం 6 జట్లతో ప్రారంభమైన ఆసియా కప్ టోర్నీలో చివరకు రెండు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. శ్రీలంక, హాంకాంగ్ జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించగా... పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లు సూపర్-4లో నిష్క్రమించాయి.

వన్డేల్లో భారత్-బంగ్లాదేశ్‌ జట్లు ఇప్పటివరకు 34సార్లు తలపడగా... టీమిండియా 28సార్లు బంగ్లాదేశ్‌పై విజయం సాధించిగా, బంగ్లాదేశ్ 5 సార్లు... ఓ మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.

తేదీ: Friday (September 28)
వేదిక: Dubai - Dubai International Cricket Stadium, Dubai, United Arab Emirates.
టైమింగ్స్: 5:00 PM (IST) Channel: Star Sports Network; India Matches on DD National
లైవ్ స్ట్రీమింగ్: HotStar.com
Match Starts at 5:00 PM

జట్ల వివరాలు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేష్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, మనీష్ పాండే, కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ కౌల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, రవీంద్ర జడేజా, దీపక్ చహర్.

బంగ్లాదేశ్:
మోర్టజా (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, తమమ్ ఇక్బాల్, మొహమ్మద్ మిథున్, లిటోన్ కుమార్ దాస్, ముష్ఫిఖర్ రహిమ్, అరిఫుల్ హాక్, మహ్ముదుల్లా, హుస్సేన్, నజ్ముల్ హుస్సేన్, మేహిదీ హాసన్, నజ్ముల్ ఇస్లాం, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజర్ రెహ్మాన్, అబూ హైదర్ రానీ.

Story first published: Thursday, September 27, 2018, 13:40 [IST]
Other articles published on Sep 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+