తొలి టీ20కి కాలుష్యం బెడద.. ఆటగాళ్ల అస్వస్థతపై బీసీసీఐ ఆందోళన!!

ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మామూలుగానే ఎక్కువగా ఉంటుంది. దీపావళి పండగ నేపథ్యంలో మరింత ఎక్కువయ్యే అవకాశ ఉంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానం (ఫిరోజ్‌షా కోట్లా)లో వచ్చే నెల 3న భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. ఈ తొలి టీ20పై వాయు కాలుష్యం ప్రభావం చూపనుంది. ఢిల్లీ వాతావరణంతో బంగ్లా ఆటగాళ్లు అస్వస్థతకు గురవుతారేమోనని డీడీసీఏ ఆందోళన పడుతోంది.

కాలుష్యం బెడద:
శీతకాలం సమీపించడం, దీపావళి టపాసులతో ఇబ్బందులు తలెత్తుతాయని ముందుగానే ఆటగాళ్లతో మాస్కులు ధరించేలా చూడాలని డీడీసీఏ భావిస్తోంది. అయితే అధిక కాలుష్యం ఉండడంతో క్రికెటర్ల పరిస్థితి ఎలా ఉంటుందోననే చర్చ సాగుతోంది. గతంలో కూడా విదేశీ ఆటగాళ్లు మాస్క్‌లు ధరించి ఆడిన సందర్భాలు ఉన్నాయి. 2017, డిసెంబర్‌లో శ్రీలంక ఆటగాళ్లు ముఖానికి మాస్క్‌లు ధరించి ఆడారు. అయినా రెండు మూడు సార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.

మ్యాచ్ సమయానికి తగ్గనున్న ఏక్యూఐ
దీపావళి పండగ కన్నా ముందే ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 301-400 మధ్య ప్రమాదకరంగా ఉంది. ఇక గురువారం ఉదయం 357గా నమోదైంది. 400 దాటితే తీవ్ర శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. దీపావళి పండుగ నేపథ్యంలో టపాసులు పేలిస్తే.. గాలి నాణ్యత మరింత దిగజారుతుంది. అయితే పండగ జరిగిన వారం రోజుల తర్వాత మ్యాచ్ ఉండడంతో.. సమస్య తీవ్రత తగ్గుతుందని డీడీసీఏ, బీసీసీఐ ఆశిస్తోంది. మరోవైపు పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో గడ్డిని తగలబెట్టొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం కూడా ఉపశమనం కలిగించే అంశం.

రొటేషన్ ప్రకారం మ్యాచ్‌లు:
శీతకాలంలో డిల్లీలో మ్యాచ్‌లు నిర్వహించొద్దని ఎప్పటినుండో డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ.. రొటేషన్ ప్రకారం మ్యాచ్‌లను కేటాయించక తప్పటం లేదు. ఈ రొటేషన్ పాలసీ ప్రకారమే తొలి టీ20ని ఢిల్లీకి కేటాయించాల్సి వచ్చింది. పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ జట్టు నేరుగా డిల్లీకి చేరుకుంటుంది. రెండో, మూడో టీ20లను నాగ్‌పుర్, రాజ్‌కోట్‌లలో ఆడుతుంది. అనంతరం ఇండోర్, కోల్‌కతాలో టెస్టులు ఆడి స్వదేశానికి పయనమవుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications