
హ్యాట్రిక్‌తో సహా ఆరు వికెట్లు
మూడో టీ20లో దీపక్ చహర్ 3.2 ఓవర్లలో 6 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. చహర్ తన తొలి ఓవర్లో 2 వికెట్లు (లిటన్ దాస్, సౌమ్యా సర్కార్) తీసి 1 పరుగు మాత్రమే ఇచ్చాడు. కొంత విరామం తర్వాత మళ్లీ బౌలింగ్‌కి వచ్చి కీలకమైన మిథున్ వికెట్ తీయడంతో పాటు 4 పరుగులు ఇచ్చాడు. ఇక 18వ ఓవర్ చివరి బంతికి షఫీయుల్ వికెట్‌ను.. ఆ తర్వాత 20వ ఓవర్ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, అమీనుల్‌లను అవుట్ చేసి 'హ్యాట్రిక్'తో పాటు 6 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:
దీపక్ చహర్ టీ20 ఫార్మాట్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్ (6/8; జింబాబ్వేపై 2012లో.. 6/16; ఆ్రస్టేలియాపై 2011లో), భారత స్పిన్నర్ యుజువేంద్ర చహల్ (6/25; ఇంగ్లండ్‌పై 2017లో) మాత్రమే ఆరు వికెట్లు తీశారు. మెండిస్, చహల్‌ల కంటే చహర్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నెలకొల్పాడు. ఇప్పటివరకు 3.2-7-6 టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.

టీ20ల్లో తొలి 'హ్యాట్రిక్':
భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో 'హ్యాట్రిక్' తీసిన తొలి బౌలర్‌గా దీపక్ రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే మొత్తంగా ఈ ఘనత సాధించిన 11వ బౌలర్. మలింగ (శ్రీలంక) రెండుసార్లు 'హ్యాట్రిక్' తీయగా.. బ్రెట్ లీ (ఆస్ట్రేలియా), ఓరమ్, సౌతీ (న్యూజిలాండ్), తిసారా పెరీరా (శ్రీలంక), అష్రఫ్ (పాకిస్తాన్), రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్), హస్నయిన్ (పాకిస్తాన్), ఖవర్ అలీ (ఒమన్), వనువా (పపువా న్యూగినియా) తలొసారి హ్యాట్రిక్ తీశారు.

చేతన్ శర్మదే తొలి హ్యాట్రిక్:
మూడు ఫార్మాట్‌లలో కలిపి భారత్ తరఫున హ్యాట్రిక్ తీసిన 8వ బౌలర్ దీపక్ చహర్. భారత్ తరఫున తొలి హ్యాట్రిక్ మాత్రం చేతన్ శర్మ 1987 ప్రపంచకప్‌లో తీసాడు. కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ భారత్ తరఫున హ్యాట్రిక్ తీశారు.

Best figures in T20Is:
6/7 D Chahar v Ban Nagpur 2019
6/8 A Mendis v Zim Hambantota 2012
6/16 A Mendis v Aus Pallekele 2011
6/25 Y Chahal v Eng Bengaluru 2017


Click it and Unblock the Notifications












