For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో హ్యాట్రిక్‌.. తొలి భారత బౌలర్‌గా దీపక్‌ చాహర్‌ రికార్డు!!

Ind vs Ban 2019,3rd T20I : Deepak Chahar Becomes First Indian Cricketer To Claim T20I Hat-Trick
India vs Bangladesh 3rd T20I: Deepak Chahar becomes first Indian to take T20I hat-trick

నాగ్‌పూర్: టీమిండియా యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌ టీ20ల్లోనే అత్యుత్తమ బౌలింగ్‌తో సంచలనం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 7 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దీపక్‌ హ్యాట్రిక్‌ సహా ఆరు వికెట్లతో విజృంభించడంతో భారత్‌ చివరి టీ20లో బంగ్లాదేశ్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బంగ్లాను 30 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. చహర్‌కే 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌', 'సిరీస్‌' అవార్డులు దక్కాయి.

దీపక్‌ హ్యాట్రిక్‌

దీపక్‌ హ్యాట్రిక్‌

దీపక్‌ చాహర్‌ తన కోటా (3.2) పూర్తికాకముందే 6 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఓవర్లో 2 వికెట్లు తీసి కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చిన దీపక్‌.. తర్వాత ఓవర్లో వికెట్‌ తీయడంతో పాటు 4 పరుగులు ఇచ్చాడు. 18వ ఓవర్‌ చివరి బంతికి షఫీయుల్‌ వికెట్‌ను దీపక్ తీసాడు. ఇక 20వ ఓవర్‌ తొలి రెండు బంతులకు ముస్తఫిజుర్, అమీనుల్‌లను అవుట్‌ చేసి 'హ్యాట్రిక్‌'తో పాటు ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.

టీ20ల్లో తొలి 'హ్యాట్రిక్‌'

టీ20ల్లో తొలి 'హ్యాట్రిక్‌'

భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో 'హ్యాట్రిక్‌' తీసిన తొలి బౌలర్‌గా దీపక్‌ చహర్‌ రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే మొత్తంగా ఈ ఘనత సాధించిన 11వ బౌలర్‌ దీపక్‌. మలింగ (శ్రీలంక) రెండుసార్లు 'హ్యాట్రిక్‌' తీయగా.. బ్రెట్‌ లీ (ఆస్ట్రేలియా), ఓరమ్, సౌతీ (న్యూజిలాండ్‌), తిసారా పెరీరా (శ్రీలంక), అష్రఫ్‌ (పాకిస్తాన్‌), రషీద్‌ ఖాన్‌ (అఫ్గానిస్తాన్‌), హస్నయిన్‌ (పాకిస్తాన్‌), ఖవర్‌ అలీ (ఒమన్‌), వనువా (పపువా న్యూగినియా) తలొసారి హ్యాట్రిక్‌ తీశారు.

భారత తొలి 'హ్యాట్రిక్‌' చేతన్ శర్మదే

భారత తొలి 'హ్యాట్రిక్‌' చేతన్ శర్మదే

మూడు ఫార్మాట్‌లలో కలిపి భారత్‌ తరఫున హ్యాట్రిక్‌ తీసిన 8వ బౌలర్‌ దీపక్‌ చహర్‌. భారత్‌ తరఫున తొలి హ్యాట్రిక్‌ మాత్రం చేతన్ శర్మ 1987 ప్రపంచకప్‌లో తీసాడు. కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ భారత్‌ తరఫున హ్యాట్రిక్‌ తీశారు.

హ్యాట్రిక్‌ సహా 6 వికెట్లు

హ్యాట్రిక్‌ సహా 6 వికెట్లు

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (33 బంతుల్లో 62; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), కేఎల్‌ రాహుల్‌ (35 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటైంది. నయీమ్‌ (48 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసాడు. నయీమ్‌, మిథున్‌ (27) మూడో వికెట్‌కు 61 బంతుల్లో 98 పరుగులు జోడించి విజయం దిశగా నడిపించినా.. భారత బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. పేసర్‌ దీపక్‌ చహర్‌కు తోడు శివమ్‌ దూబే 3 వికెట్లు తీయడంతో బంగ్లా చేతులెత్తేసింది.

Story first published: Monday, November 11, 2019, 8:40 [IST]
Other articles published on Nov 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+