అలా అయితే! భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 జరగడం కష్టమే!

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టీ20 రాజ్ కోట్ వేదికగా నవంబర్ 7న జరగనుంది. అయితే, ఈ టీ20కి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా పశ్చిమ గుజరాత్, సౌరాష్ట్రకు భారీ తుఫాన్ వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒమన్ వైపు పయనిస్తోంది. క్షణంలోనైనా అది పశ్చిమ గుజరాత్, సౌరాష్ట్రలవైపు దూసుకొచ్చే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారులు ఈ తుఫాన్‌కు "మహా" అని పేరు పెట్టారు. ఈ తుఫాన్ ప్రభావం కారణంగా బుధవారం నుంచి గుజరాత్, సౌరాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఐఎండీ డైరెక్టర్ జయంత్ సర్కార్ మాట్లాడుతూ
ఈ తుఫాన్‌పై ఐఎండీ డైరెక్టర్ జయంత్ సర్కార్ మాట్లాడుతూ "డయ్యుకు నైరుతి దిశలో అరేబియా సముద్రంలో 580 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది చాలా తీవ్రమైన తుఫానుగా మారి ద్వారకా లేదా డయ్యు మధ్య బుధవారం రాత్రి లేదా గురువారం తెల్లవారుజామున గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటనుంది" అని అన్నారు.
హర్షా భోగ్లే కూడా
ఈ తుఫాన్‌పై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా ట్విట్టర్‌లో స్పందించారు. "రాజ్‌కోట్‌లో టీ20కి ముందు పశ్చిమ తీరంలో అల్పపీడనం ఏర్పడిందని తుపాను వార్తలు వస్తున్నాయి. సౌరాష్ట్ర తీరంలో నవంబర్ 6, 7న మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ తుపాను మరీ ప్రమాదకరం కావొద్దని, అక్కడి ప్రజలకు ఇబ్బందులు కలగొద్దని కోరుకుంటున్నాను. ఈ ఏడాది వాతావరణం ఊహించని విధంగా ఉంటోంది" అని భోగ్లే ట్వీట్ చేశారు.

రెండో టీ20 రద్దైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు
అయితే, మ్యాచ్‌కి ముందు గనుక గుజరాత్‌లో భారీ వర్షాలు కురిస్తే రెండో టీ20 రద్దైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

సిరీస్‌ను 1-1తో సమం చేయాలని
దీంతో మూడు టీ20ల సిరిస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో రాజ్ కోట్ వేదికగా జరగనున్న రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలనే గట్టి పట్టుదలతో రోహిత్ సేన ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications