For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో టీ20: రెండు మార్పులతో భారత్.. తుది జట్టు ఇదే!!

India vs Bangladesh 2nd T20I : India Predicted XI-Two Key Changes Expected || Oneindia Telugu
India vs Bangladesh 2nd T20I: India Predicted XI, Two key changes expected

రాజ్‌కోట్‌: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌ గురువారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. భారత్‌పై బంగ్లా తొలి టీ20 విజయాన్ని అందుకుని సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రాజ్‌కోట్‌లో కూడా గెలిచి సిరీస్‌ను దక్కించుకోవాలని బంగ్లా చూస్తుంటే.. విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భారత్ భావిస్తోంది.

జట్టులోకి సంజు శాంసన్

జట్టులోకి సంజు శాంసన్

మ్యాచ్ ప్రారంభానికి ముందు ఫేవరెట్‌గా భావించిన టీమిండియా అంచనాలను అందుకోలేకపోయింది. ఫీల్డింగ్, బ్యాటింగ్‌, బౌలింగ్ అన్ని విభాగాల్లో పూర్తిగా నిరాశపరిచింది. అయితే రెండో టీ20లో గెలిస్తేనే భారత్ సిరీస్‌ రేసులో నిలుస్తుంది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ తుది జట్టులో రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. తొలి టీ20 మ్యాచ్‌లో విఫలమయిన కేఎల్ రాహుల్ స్థానంలో యువ ఆటగాడు సంజు శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.

ఖలీల్ స్థానంలో శార్దూల్

ఖలీల్ స్థానంలో శార్దూల్

19వ ఓవర్లో వరుసగా నాలుగు బౌండరీలు ఇచ్చి టీమిండియాకు విజయాన్ని దూరం చేసిన పేసర్ ఖలీల్ అహ్మద్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ రానున్నాడు. దీపక్ చాహర్, యుజువేంద్ర చహల్ తమ స్థానాలను నిలుపోకోనున్నారు. బ్యాట్‌తో మెరిసిన వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్యాలు కూడా కొనసాగనున్నారు. తొలి మ్యాచ్ ఆడిన శివమ్ దుబేకు మరో అవకాశం దక్కనుంది. విఫలమయినా రిషబ్ పంత్ కీపర్ స్థానంలో ఉంటాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ భారం మోయనున్నారు.

రెండు మార్పులు

రెండు మార్పులు

మొత్తానికి టీమిండియా రెండో టీ20 కోసం రెండు మార్పులు చేయనుంది. కేఎల్ రాహుల్ స్థానంలో సంజు శాంసన్.. ఖలీల్ అహ్మద్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు మార్పులు తప్పితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అయితే కెప్టెన్, కోచ్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

సైక్లోన్ మహా ముప్పు

సైక్లోన్ మహా ముప్పు

ఢిల్లీలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ను వాయు కాలుష్యం ఇబ్బందిపెట్టగా.. రెండో టీ20ని సైక్లోన్ మహా అడ్డుకునే అవకాశం ఉంది. అయితే సైక్లోన్ మహా హెచ్చరికలు ఉన్నా.. భారత్‌-బాంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అని సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం మంగళవారం స్పష్టం చేసింది. మ్యాచ్ జరిగే రోజు ఉదయం వర్షం పడినా తక్కువ సమయంలోనే మ్యాచ్ నిర్వహణకు స్టేడియాన్ని సిద్ధం చేయగలం అని పేర్కొంది.

భారత తుది జట్టు

భారత తుది జట్టు

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కృనాల్ పాండ్యా, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చహల్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్.

Story first published: Wednesday, November 6, 2019, 15:42 [IST]
Other articles published on Nov 6, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+