For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌లో బంగ్లా పర్యటన పూర్తి షెడ్యూల్, టైమింగ్స్, టీవీ ఛానెల్ ఇన్ఫో!

India Vs Bangladesh 2019 (Nov 3 to Nov 22): Full Schedule, Squads, Timings, TV Channel, Live Streaming Information

హైదరాబాద్: 3 టీ20లు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు రానుంది. బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరిస్‌కు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో టీ20 సిరిస్‌కు కోహ్లీ స్థానంలో వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.

టీ20 సిరిస్ అనంతరం రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు తిరిగి కోహ్లీ నాయకత్వం వహిస్తాడు. వరల్డ్‌కప్ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. కోహ్లీ పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని అతడికి విశ్రాంతినిచ్చారు. నవంబరు 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

ఆ తర్వాత రెండో టీ20 మ్యాచ్‌ రాజ్‌కోట్ వేదికగా 7న, ఆఖరి టీ20 మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా 10న జరగనున్నాయి. అన్ని టీ20 మ్యాచ్‌లూ రాత్రి 7 గంటలకి ప్రారంభం కానున్నాయి. నవంబరు 14న నుంచి ఇండోర్ వేదికగా తొలి టెస్టు.. నవంబర్ 22 నుంచి కోల్‌కతా వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది.

భారత్‌లో బంగ్లా పర్యటన పూర్తి షెడ్యూల్, టైమింగ్స్:
1st T20I - New Delhi (November 3) - 7:00 PM (IST)
2nd T20I - Rajkot (November 7) - 7:00 PM (IST)
3rd T20I - Nagpur (November 10) - 7:00 PM (IST)

1st Test - Indore (November 14-18) - 9:30 AM (IST)
2nd Test - Kolkata (November 22-26) - 9:30 AM (IST)

TV Channels: Star Sports Network
Live Streaming: HotStar.com

టీ20లకు భారత జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, సంజు శాంసన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌పంత్‌ (కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, కృనాల్‌ పాండ్య, యుజువేంద్ర చాహల్‌, రాహుల్‌ చాహర్‌, దీపక్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, శివమ్‌ దూబే, శార్దూల్‌ ఠాకూర్‌

టెస్టులకు భారత జట్టు:
విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, వృద్ధిమాన్‌ సాహా (కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, శుభ్‌మన్‌గిల్‌, రిషభ్‌పంత్‌

బంగ్లా టీ20 జట్టు:
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, మహ్మద్ నయిం, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అమినుల్ ఇస్లామ్, అర్ఫాట్ సన్నీ, మహ్మద్ సైఫుద్దీన్, అల్ అమిన్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సైపుల్లా ఇస్లామ్, అపిఫ్ హుస్సేన్, మసదేక్ హుస్సేన్.

Story first published: Saturday, October 26, 2019, 18:39 [IST]
Other articles published on Oct 26, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+