
బంగ్లాదేశ్ ఆలౌట్
* 30.3 - ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆలౌట్ అయిన ఓవర్లు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తమ ప్రత్యర్ధి జట్టుని ఇన్ని తక్కువ ఓవర్లలో ఎప్పుడూ ఆలౌట్ చేయలేదు. అంతకముందు జింబాబ్వేను 44.2 ఓవర్లలో ఆలౌట్ చేసింది.
* 106 ఆలౌట్ - భారత్‌పై బంగ్లాదేశ్‌కు ఇది రెండో అత్యల్ప స్కోరు. 2000లో జరిగిన తొలి టెస్టులో ఆ జట్టు 91 పరుగులకే ఆలౌటైంది.

ఇషాంత్ శర్మ అరుదైన ఘనత
* 5/22 - ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ చేసిన ప్రదర్శన. భారత్ తరుఫున రెండో అత్యుత్తమ ప్రదర్శన. ఈ ఏడాదే వెస్టిండీస్‌పై బుమ్రా (5/7) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
* 4 - పింక్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా కోల్పోయిన పది వికెట్లూ భారత పేసర్లే తీశారు. స్వదేశంలో భారత పేసర్లు ఈ ఘనత సాధించడమిది నాలుగోసారి మాత్రమే. ఇంతకుముందు 1981లో ఇంగ్లాండ్‌పై, 1983లో వెస్టిండీస్‌పై, 2017లో శ్రీలంకపై పదికి పది వికెట్లూ పేసర్లే పడగొట్టారు.

కోహ్లీ 5000 పరుగులు
* 5000 - టెస్టు కెప్టెన్‌గా 5 వేల పరుగుల (86 ఇన్నింగ్స్‌ల్లో) మైలురాయిని అందుకున్న భారత కెప్టెన్ కోహ్లీ.. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రకీ పాంటింగ్ 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ను చేరుకుంటే అంతకంటే 11 ఇన్నింగ్స్‌ల ముందే కోహ్లీ 5000 పరుగులు చేశాడు.

100 ఔట్లు చేసిన సాహా
* 100 ఔట్లు - ఈ మ్యాచ్‌లో షాద్‌మన్ క్యాచ్ అందుకోవడం ద్వారా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా టెస్టు క్రికెట్‌లో 100 ఔట్లలో భాగస్వామి అయ్యాడు. ఈ ఫీట్ సాధించిన ఐదో భారత కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇందులో 89 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు ఉన్నాయి.

తొలిసారి ఇద్దరు కాంకషన్‌లు
* 2 - షమీ బౌన్సర్లతో రెచ్చిపోవడంతో పింక్ బాల్ టెస్ట్‌లో బంగ్లా ఇద్దరు ఆటగాళ్లను కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దించింది. లిటన్ దాస్, నయీమ్ గాయపడటంతో వారి స్థానాల్లో మెహదీ, తైజుల్ లను బంగ్లా మైదానంలో దింపింది.


Click it and Unblock the Notifications












