Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరో బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డు: మయాంక్ స్కోరుని దాటలేకపోయిన బంగ్లాదేశ్

India vs Bangladesh, 1st Test Day 3: Mayank Agarwal sixth batsman to score more runs against opposite team

హైదరాబాద్: ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో ముగిసిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రత్యర్థి జట్టు చేసిన స్కోరు కంటే ఎక్కువ పరుగులు సాధించిన భారత ఆరో బ్యాట్స్‌మన్‌గా మయాంక్‌ అగర్వాల్‌ చరిత్ర సృష్టించాడు.

గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక, మూడో రోజైన శనివారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ 69.2 ఓవర్లకు 213 పరుగులకే కుప్పకూలింది. దీంతో రెండు ఇన్నింగ్స్‌లోనూ మయాంక్‌ చేసిన (243) పరుగులను బంగ్లా దాటలేకపోయింది.

భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు:

భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు:

1955/56 - వినూ మన్కడే (231) vs న్యూజిలాండ్‌ (209, 219)

2003/04 - రాహుల్‌ ద్రవిడ్‌ (270) vs పాకిస్థాన్‌ (224, 245)

2004/05 - సచిన్ టెండూల్కర్ (248) vs బంగ్లాదేశ్‌ (184, 202)

2017/18 - విరాట్‌ కోహ్లీ (213) vs శ్రీలంక (205, 166)

2019/20 - రోహిత్‌ శర్మ (212) vs దక్షిణాఫ్రికా (162, 133)

2019/20 - మయాంక్‌ అగర్వాల్‌ (243) vs బంగ్లాదేశ్‌ (150, 213)

ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయం

తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజైన శనివారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ 69.2 ఓవర్లకు 213 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ నాలుగు వికెట్ల తీయగా, రవిచంద్రన్ అశ్విన్ మూడు, ఉమేశ్ యాదవ్ రెండు, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ లభించింది.

టీమిండియాకు ఇది 10వ ఇన్నింగ్స్ విజయం

టీమిండియాకు ఇది 10వ ఇన్నింగ్స్ విజయం

విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు ఇది 10వ ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. ఫలితంగా అత్యధిక ఇన్నింగ్స్ విజయాలు సాధించిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ ఖాతాలో 10 ఇన్నింగ్స్ విజయాలు ఉండగా, భారత కెప్టెన్‌గా ధోని 9 ఇన్నింగ్స్ విజయాలను నమోదు చేశాడు. ఈ జాబితాలో మహ్మద్ అజారుద్దీన్ 8 ఇన్నింగ్స్ విజయాలతో మూడో స్థానంలో నిలవగా... సౌరవ్ గంగూలీ 7 ఇన్నింగ్స్ విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

అత్యధిక విజయాలను నమోదు చేసిన భారత కెప్టెన్లు:

అత్యధిక విజయాలను నమోదు చేసిన భారత కెప్టెన్లు:

10 Virat Kohli *

9 MS Dhoni

8 Mohd Azharuddin

7 Sourav Ganguly

స్కోరు వివరాలు:

భారత్ తొలి ఇన్నింగ్స్: 493/6 డిక్లేర్డ్

బంగ్లా తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్

బంగ్లా రెండో ఇన్నింగ్స్: 213 ఆలౌట్

Story first published: Saturday, November 16, 2019, 18:20 [IST]
Other articles published on Nov 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+