India vs Bangladesh, 1st Test Day 3: ఇండోర్ టెస్టులో బంగ్లా ఓపెనర్ల చెత్త రికార్డు!

హైదరాబాద్: ఇండోర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. గురువారం ప్రారంభమైన ఈ తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఓపెనర్లు తమ చెత్త ప్రదర్శనతో వార్తల్లోకి ఎక్కారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బంగ్లా ఓపెనర్లు ఒకేవిధమైన స్కోరు చేసిన ఓ చెత్త రికార్డుని తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత జట్టులో మయాంక్ అగర్వాల్ (243), రహానే (86), రవీంద్ర జడేజా (60 నాటౌట్) రాణించడంతో రెండో రోజు 493/6 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఫలింతగా తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగుల ఆధిక్యం లభించింది.

ఇన్నింగ్స్‌ను 493/6 వద్ద డిక్లేర్ చేసిన టీమిండియా
శనివారం ఉదయం మరికొన్ని పరుగులు చేసి బంగ్లాని బ్యాటింగ్‌కి ఆహ్వానిస్తుందని అంతా భావించారు. అయితే, అందుకు భిన్నంగా బ్యాటింగ్‌కు రాకుండానే టీమిండియా తొలిఇన్నింగ్స్‌ను 493/6 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు చెలరేగడంతో 18 పరుగులకి రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అదే వ్యక్తిగత స్కోరు వద్ద
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు షాదమ్‌న్(6) పరుగులు చేసిన ఔటవగా, ఇమ్రుల్(6) పరుగులే చేసి ఔటయ్యాడు. ఇక, శనివారం ఉదయం ప్రారంభమైన రెండో ఇన్నింగ్స్‌లో కూడా వీరిద్దరూ అదే వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో షాద్‌మన్(6) పరుగుల వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

రెండో ఇన్నింగ్స్‌లోనూ సరిగ్గా అలానే!
మరోవైపు ఇమ్రుల్(6) కూడా అదే పరుగుల వద్ద ఇషాంత్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో తొలి టెస్టులో బంగ్లా ఓపెనర్ల స్కోరు రెండు ఇన్నింగ్స్‌ల్లో 6,6,6,6గా నమోదైంది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. ఇక్కడ విశేషం ఏంటంటే తొలి ఇన్నింగ్స్‌లో ఉమేశ్ యాదవ్‌కు ఔటైన ఇమ్రుల్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడి బౌలింగ్‌లోనే ఔట్ కావడం.

ఆరో ఓవర్‌లోనే ఔటైన ఇమ్రుల్
షాద్‌మన్ తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్ శర్మకు వికెట్‌ను సమర్పించుకుంటే, రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడి బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. మరో విచిత్రం ఏంటంటే వీరిద్దరూ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు చేరారు. ఇమ్రుల్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌లో వికెట్ కోల్పోతే, రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆరో ఓవర్‌లోనే ఔటయ్యాడు.

ఏడో ఓవర్‌లో వికెట్‌ను చేజార్చుకుంటే
షాద్‌మన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌లో వికెట్‌ను చేజార్చుకుంటే, రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. ఇక, ఇమ్రుల్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ ఆఖరి బంతికి ఔటైతే, రెండో ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్ మొదటి బంతికి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో
15 ఓవర్లు పూర్తయ్యేసరికి బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్(4), మహ్మదుల్లా పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ కోల్పోయిన నాలుగు వికెట్లలో ఉమేశ్, ఇషాంత్‌లు చెరో రెండు వికెట్లు తీయగా... మహ్మద్ షమీకి రెండు వికెట్లు లభించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications