For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తీవ్ర కాలుష్యంలోనే నేడు భారత్, బంగ్లాదేశ్‌ తొలి టీ20.. దూబే అరంగేట్రం?

India vs Bangladesh, 1st T20I: Match Preview, Expected Playing 11, Live Streaming, Weather and Pitch Report

ఢిల్లీ: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన భారత జట్టు బంగ్లాదేశ్‌తో మరో సమరానికి సిద్దమయింది. మొదటగా టీ20 ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. సీనియర్లతో పాటు పలువురు కుర్రాళ్లు భారత్‌ తరఫున తమ సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. టీ20 ప్రపంచకప్‌ కోసం యువ ఆటగాళ్లను పరీక్షిస్తున్న భారత్‌.. ఈ మూడు మ్యాచ్‌లతో ఓ అంచనాకు వచ్చే అవకాశముంది. ఇక కీలక ఆటగాళ్లు లేకుండానే బంగ్లా జట్టు పొట్టి ఫార్మాట్‌కు రెడీ అవుతోంది.

ఫామ్‌లో రోహిత్:

ఫామ్‌లో రోహిత్:

రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండా భారత్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు రెడీ అయింది. భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ ఇప్పుడు అదే జోరును కొనసాగించాలనుకుంటున్నాడు. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ మాత్రం సత్తా చాటట్లేదు. ప్రపంచకప్‌లో అనంతరం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో 36, 40 పరుగులు చేశాడు. ఆ తర్వాత విజయ్‌ హజారే టోర్నీ ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. దీంతో ఇప్పటికైనా గదిలో పడాల్సిన అవసరం ఉంది.

దూబే అరంగేట్రం?:

దూబే అరంగేట్రం?:

మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్‌, శ్రేయాస్‌ అయ్యర్, కృనాల్ పాండ్యా, రిషభ్‌ పంత్‌ మెరుపులు మెరిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. కోహ్లీ స్థానంలో రాహుల్‌కు అవకాశం లభించవచ్చు. అయితే యువ ఆటగాడు సంజు సామ్సన్‌ నుంచి అతనికి పోటీ ఎదురవుతోంది. ఆల్‌రౌండర్‌గా శివమ్‌ దూబే అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైంది. హార్దిక్‌ పాండ్యా స్థానంలో చోటు దక్కించుకున్న శివమ్‌.. అదే తరహాలో విధ్వంసకర బ్యాటింగ్‌ చేయగడు. మనీశ్ పాండే బెంచ్‌కు పరిమితం కావాల్సిందే.

పేస్ భారాన్ని మోయనున్న చాహర్:

పేస్ భారాన్ని మోయనున్న చాహర్:

సీనియర్ పేసర్లు అందుబాటులో లేకపోవడంతో ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్ పేస్ భారాన్ని మోయనున్నారు. శార్దుల్ ఠాకూర్‌కు చాన్స్ దక్కుతుందా చూడాలి. యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో ఉండటం ఖాయమే. కొంత విరామం తర్వాత జట్టులోకి వచ్చిన చహల్‌ ఏ మేరకు చూడాలి.

బంగ్లాకు ఎదురుదెబ్బలు:

బంగ్లాకు ఎదురుదెబ్బలు:

సిరీస్ ప్రారంభానికి ముందే బంగ్లాకు ఎదురుదెబ్బలు తగిలాయి. ఐసీసీ బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబల్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక తమీమ్ ఇక్బాల్, సైఫుద్దీన్ సిరీస్‌కు దూరం కావడంతో బంగ్లాదేశ్ జట్టు బలహీనపడింది. ఇలాంటి పరిస్థితులలో మహ్ముదుల్లా రియాద్ జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకంగా మారింది. సీనియర్ ఆటగాళ్లు సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, మొసద్దిక్ హుస్సేన్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. ప్రధాన పేసర్ ముస్తఫిజుర్ రహ్మాన్ బౌలింగ్‌లోసత్తాచాటలేకపోతున్నాడు. స్పిన్ విభాగంలో కూడా బలహీనంగానే ఉంది. అల్‌ అమీన్, అబూ హైదర్‌లాంటి బౌలర్లు భారత్‌ను ఎంత మేరకు నిలువరిస్తారనేది సందేహమే.

పిచ్, వాతావరణం

పిచ్, వాతావరణం

టి20 ఫార్మాట్‌కు తగినట్లుగా ఢిల్లీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. కొంత వరకు స్పిన్‌ ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీపావళి అనంతరం దేశ రాజధానిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఆదివారం కూడా పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చు. పూర్తి కాలుష్యభరిత వాతావరణంలో మ్యాచ్‌ జరుగుతోంది. ఆటకు అంతరాయం కలగకపోయినా.. క్రికెటర్లకు ఇబ్బంది మాత్రం తప్పకపోవచ్చు.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

భారత్‌:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌/సంజు సామ్సన్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శివమ్‌ దూబే, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, దీపక్‌ చహర్, శార్దుల్‌ ఠాకూర్/ఖలీల్‌ అహ్మద్.

బంగ్లాదేశ్‌:

లిటన్‌ దాస్‌, సౌమ్య సర్కార్‌, నయీమ్‌/మిథున్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, మహ్ముదుల్లా (కెప్టెన్‌), మొసద్దెక్‌ హుస్సేన్‌, అఫీఫ్‌ హుస్సేన్‌, అరాఫత్‌ సన్నీ, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, అల్‌ అమిన్‌ హొస్సేన్‌, తైజుల్‌ ఇస్లాం.

Story first published: Sunday, November 3, 2019, 12:18 [IST]
Other articles published on Nov 3, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+