పేరు మారిన తర్వాత తొలి టీ20: అరుణ్ జైట్లీ గణాంకాలివే, భారత్-బంగ్లా మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం జరగనున్న తొలి టీ20కి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ సిద్ధమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ తర్వాత భారతదేశంలో పురాతనమైన రెండో స్టేడియం అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్లా). ఈ స్టేడియంలో భారత క్రికెటర్లు ఎన్నో అద్భుతమైన రికార్డులను నెలకొల్పింది.
1999లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసింది ఈ స్టేడింయలోనే. టెస్టుల్లో 29వ సెంచరీతో బ్రాడ్‌మన్ అత్యధిక సెంచరీల రికార్డును గవాస్కర్ ఇదే స్టేడయంలో సమం చేశాడు. ఆ తర్వాత గవాస్కర్ అత్యధిక సెంచరీల(34) రికార్డుని 2005లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇక్కడే బద్దలు కొట్టాడు.
పేరు మారాక ఫిరోజ్‌షా కోట్లా స్టేడియం ఆతిథ్యమిస్తున్న మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఇది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంకొక విషయం ఏంటంటే భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇప్పటివరకు ద్వైపాక్షిక టీ20 జరగలేదు. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న తొలి టీ20 ద్వైపాక్షిక సిరిస్ ఇదే.

అన్ని టీ20ల్లో టీమిండియాదే విజయం
ఈ స్టేడియంలో ఆడిన అన్ని టీ20ల్లో టీమిండియానే విజయం సాధించడం విశేషం. టీ20 వరల్డ్‌కప్‌లో 3, ఆసియా కప్‌లో 2, నిదహాస్ ముక్కోణపు టోర్నీలో 3 సార్లు భారత్ విజయం సాధించింది. చివరగా ఈ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 53 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అరుణ్ జైట్లీ స్టేడియం వాస్తవాలు:
ప్రారంభించింది: 1883
కెపాసిటీ: 48000

టెస్టు గణాంకాలు
మొత్తం మ్యాచ్‌లు: 34
ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలిచినవి: 6
ఫస్ట్ బౌలింగ్ చేస్తే గెలిచినవి: 13
ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజి స్కోరు: 352
రెండో ఇన్నింగ్స్ యావరేజి స్కోరు: 323
మూడో ఇన్నింగ్స్ యావరేజి స్కోరు: 239
నాలుగో ఇన్నింగ్స్ యావరేజి స్కోరు: 173
అత్యధిక స్కోరు: 644/8 (214 Ov) by WI vs IND
అత్యల్ప స్కోరు: 75/10 (30.5 Ov) by IND vs WI

వన్డే గణాంకాలు
మొత్తం మ్యాచ్‌లు: 25
ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలిచిని: 12
ఫస్ట్ బౌలింగ్ చేస్తే గెలిచినవి: 12
ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజి : 234
రెండ్ ఇన్నింగ్స్ యావరేజి: 212
అత్యధిక స్కోరు: 330/8 (50 Ov) by WI vs NED
అత్యల్ప స్కోరు: 115/10 (31.3 Ov) by NED vs WI
అత్యధిక స్కోరు చేధన: 281/4 (40.5 Ov) by IND vs SL
కాపాడుకున్న తక్కువ స్కోరు: 167/10 (43.4 Ov) by IND vs PAK

టీ20 గణాంకాలు
మొత్తం మ్యాచ్‌లు: 5
ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలిచినవి: 3
ఫస్ట్ బౌలింగ్ చేస్తే గెలిచినవి: 2
ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజి స్కోరు: 157
రెండో ఇన్నింగ్స్ యావరేజి స్కోరు: 143
అత్యధిక స్కోరు: 202/3 (20 Ov) by IND vs NZ
అత్యల్ప స్కోరు: 120/10 (19.3 Ov) by SL vs RSA
అత్యధిక స్కోరు చేధన: 159/3 (17.1 Ov) by ENG vs NZ
కాపాడుకున్న తక్కువ స్కోరు: 142/7 (20 Ov) by ENG vs AFG
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications