న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరీస్‌ను కైవసం చేసుకున్న కంగారూలు, మిథాలీ జట్టు వైట్ వాష్

harmanpreet kaur, smriti

హైదరాబాద్: హైదరాబాద్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం చివరి మ్యాచ్‌ జరుగుతోంది. వన్డే సిరీస్‌ చేజారిపోయినా.. చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకుందామని పోరాడిన భారత మహిళలకు నిరాశే మిగిలింది. రెండో వన్డేలానే, మూడో వన్డేలోనూ భారీ టార్గెట్‌ను నిర్దేశించిన ఆస్ట్రేలియా జట్టు భారత జట్టును సునాయాసంగా గెలిచింది. ఆదివారం ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ను 97పరుగుల ఆధిక్యంతో ఓడించింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు 333 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 50 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు ముచ్చెమటలు పోయించింది. అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడిన కంగారూల జట్టులో ఓపెనర్ అలిసా హేలీ సెంచరీ దాటి 133స్కోరుతో జట్టులో అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఓపెనర్‌గా దిగి చెలరేగి ఆడిన హేలీ శిఖా పాండే బౌలింగ్‌ చేస్తున్న 37 ఓవర్లో ఏకంగా నాలుగు ఫోర్లు కొట్టింది.

ఆసీస్ నిర్దేశించిన 333 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 44.4 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు జెమీమా(42), స్మృతి మంధాన(52), మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించారు. గాయంకావ‌డంతో ఏక్తా బిస్త్ బ్యాటింగ్ చేయ‌డానికి రాలేదు.భారీ ఇన్నింగ్స్ ఆడేందుకు ఏ ఒక్కరూ పోరాడకపోవడంతో తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆసీస్ బౌలర్లలో గార్డనర్ 3, మెగాన్, పెర్రీ చెరో రెండు వికెట్లు తీసి ఆసీస్‌కు గొప్ప విజయాన్ని అందించారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో ఓపెనర్ అలిస్సా హేలీ(133, 115 బంతుల్లో 17ఫోర్లు, 2సిక్సర్లు) వీరోచిత శతకంతో చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. భారీ శతకంతో ఆసీస్ సునాయాసంగా 300 పరుగుల మార్క్‌ను దాటింది. వన్డే కెరీర్‌లో ఆమెకిది తొలి సెంచరీ కావడం విశేషం. హేలీని కట్టడి చేయడంలో భారత్ బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. పసలేని బౌలింగ్‌తో ప్రత్యర్థి జోరుకు అడ్డుకట్టవేయలేకపోయారు. ఆరంభంలోనే జట్టు స్కోరు 19 వద్ద నికోలా బోల్టన్(11) పెవిలియన్ చేరినప్పటికీ ఓపెనర్ హేలీ ఆతిథ్య బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.

Story first published: Sunday, March 18, 2018, 16:55 [IST]
Other articles published on Mar 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X