For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత్ టెస్టు సిరీస్ గెలవకపోతేనే ఆశ్చర్యపోతాం'

India vs Australia 2018-2019 : If Virat Kohli & Co Don’t Win Test series...? | Oneindia Telugu
India vs Australia: ‘Will be surprised if Virat Kohli & Co don’t win Test series’

హైదరాబాద్: ఎన్నాళ్లుగానో ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ సాధించాలని కలలుకంటోన్న టీమిండియాకు ఇదే చక్కని సమయమని ఆ దేశ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో 3 టీ20లు, 4టెస్టులతో పాటు 3 వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని ఆడేందుకు భారత్ జట్టు శుక్రవారం అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. నవంబరు 21న తొలి టీ20తో సిరీస్ ప్రారంభంకానుండగా.. డిసెంబరు 6 నుంచి టెస్టు సిరీస్‌ మొదలుకానుంది.

వార్నర్, స్మిత్ లేని సమయమే అనుకూలంగా

వార్నర్, స్మిత్ లేని సమయమే అనుకూలంగా

ఓపెనర్ డేవిడ్ వార్నర్, మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ నిషేధం కారణంగా ఆస్ట్రేలియా జట్టుకి దూరమైయ్యారు. పరిణతి లేని బ్యాట్స్‌మెన్ కారణంగా ఇటీవల ఆ జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దీంతో ఆ గడ్డపై భారత్ జట్టు టెస్టు సిరీస్‌ని గెలవలేకపోతే ఆశ్చర్చపోవాల్సి వస్తుందని జోన్స్ చెప్పుకొచ్చాడు.

అశ్విన్‌తో పాటు కుల్దీప్ తోడై:

అశ్విన్‌తో పాటు కుల్దీప్ తోడై:

భారత్ జట్టు‌‌కి ఇదే మంచి అవకాశం. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టు టెస్టు సిరీస్‌ని గెలవలేకపోయింది. కానీ.. తాజా పర్యటనలో సిరీస్‌ని గెలవలేకపోతే అది ఆశ్చర్యమే. పర్యటనలో అశ్విన్ కీలకమవుతాడని నా అంచనా. అతనితో పాటు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ని ఎదుర్కోవడం టెస్టుల్లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కి సవాలే. అయితే.. ఆరోన్ ఫించ్, హ్యాండ్స్‌కబ్ స్పిన్‌‌ని బాగా ఆడగలరు. కానీ.. సిరీస్‌లో భారత్ స్పిన్నర్లకి ఎంతమేర పోటీనిస్తారో..? చూడాలి.

టెస్టు సెంచరీ చేయాలని కుతూహలంగా:

టెస్టు సెంచరీ చేయాలని కుతూహలంగా:

ఆస్ట్రేలియాకు ఆడిన తొలినాళ్లలో 13 మంది మాత్రమే ఆడేవాళ్లుండేవారు. వారిలో టెస్టు సెంచరీ చేసిన వాళ్లే లేరు. కానీ, ఇప్పుడు 30 నుంచి 40 మధ్యలో ఉన్నారు. ఇప్పటి ఆటగాళ్లను విశ్లేషిస్తే ఆశ్చర్యపోతున్నా. జట్టు మేనేజ్‌మెంట్, కోచ్ అంతా కలిసి బ్యాట్స్‌మెన్ లోపాలను ఎత్తి చూపుతున్నారు. అందుకే ఇప్పుడు బ్యాట్స్‌మెన్ టెస్టు క్రికెట్ సెంచరీ కోసం ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా కొనసాగితే.. టెస్టు క్రికెట్‌లో ఆటగాళ్లు మరింత ముందుకెళ్లే అవకాశం లేకపోలేదు. '

2016లో భారత్ ఆఖరిసారి పర్యటించి

2016లో భారత్ ఆఖరిసారి పర్యటించి

ఆస్ట్రేలియా గడ్డపై 2016లో ఆఖరిసారి పర్యటించిన భారత్ జట్టు ఐదు వన్డేల సిరీస్‌ని 1-4తో చేజార్చుకున్నా.. మూడు టీ20ల సిరీస్‌ని మాత్రం 3-0తో గెలిచింది. ఆ సిరీస్‌లో టెస్టులు లేవు.

Story first published: Friday, November 16, 2018, 17:12 [IST]
Other articles published on Nov 16, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+