4-0తో ఆసీస్ సిరిస్‌ను గెలుస్తుంది: జోస్యం చెప్పిన మెక్‌గ్రాత్

హైదరాబాద్: మరో మూడు రోజుల్లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య గబ్బా వేదికగా మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌కు ఆసీస్ స్టార్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు దూరం కావడం... గత కొన్నాళ్లుగా ఆస్ట్రేలియా జట్టు పేలవ ప్రదర్శన చేస్తుండటంతో ఈ సిరిస్‌లో ఎవరు గెలుస్తారనే ఆసక్తికర చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లాంటి ప్లేయర్స్ లేకపోయినా ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌ను 4-0తో గెలుస్తుందని గ్లెన్ మెక్‌గ్రాత్ వ్యాఖ్యానించాడు. ఈ సిరిస్‌లో ఆస్ట్రేలియానే ఫేవరెట్ అని మెక్‌గ్రాత్ స్పష్టం చేశాడు.

స్మిత్, వార్నర్ లేని లోటు పూడ్చడం కష్టం
"స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేని లోటు పూడ్చడం కష్టం. అయితే, యువ బ్యాట్స్‌మెన్‌కు ఇది చక్కటి అవకాశం. వాళ్లు బాగా ఆడగలిగితే జట్టులో చోటును ఖాయం చేసుకుంటారు. ఇది చాలా ఆసక్తికర సిరీస్ కానుంది. అయినా ఆస్ట్రేలియా 4-0తో సునాయాసంగా గెలుస్తుంది అనుకుంటున్నా" అని మెక్‌గ్రాత్ అన్నాడు.

అత్యుత్తమంగా ఆడితేనే సిరీస్ గెలుస్తాం
స్మిత్, వార్నర్ లేకపోవడం ఆస్ట్రేలియా జట్టుపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని, అత్యుత్తమంగా ఆడితేనే సిరీస్ గెలుస్తామని మెక్‌గ్రాత్ అన్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా కూడా ఈ సిరిస్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఆసీస్ పర్యటనలో భాగంగా టీమిండియా 3టీ20లు, 4 టెస్టులు, 3వన్డేలు ఆడనుంది.

తొలి టీ20 నవంబర్ 21న ప్రారంభం
తొలి టీ20 నవంబర్ 21న ప్రారంభం కానుంది. అనంతరం డిసెంబర్ 6 నుంచి నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్, జనవరి 3 నుంచి మూడు వన్డేల సిరిస్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో భారత్ తలపడే మ్యాచ్‌ల షెడ్యూల్, ఇరు జట్లు, లైవ్ టెలీకాస్ట్ సమయాలను మీకోసం:
ఛానల్: స్టార్ స్పోర్ట్ నెట్‌వర్క్
లైవ్ స్ట్రీమింగ్: Hotstar.com

మూడు టీ20లు
తొలి టీ20: నవంబర్ 21 - గబ్బా, బ్రిస్బేన్ (మధ్యాహ్నం 2.30 గంటలకు)
రెండో టీ20: నవంబర్ 23 - ఎంసీజీ, మెల్‌బోర్న్ (మధ్యాహ్నం 1.30 గంటలకు)
మూడో టీ20: నవంబర్ 25 - ఎస్‌సీజీ, సిడ్నీ (మధ్యాహ్నం 1.30 గంటలకు)

టెస్టు సిరిస్
తొలి టెస్ట్: డిసెంబర్ 6 నుంచి 10 వరకు - అడిలైడ్ (ఉదయం 6 గంటల నుంచి)
రెండో టెస్ట్: డిసెంబర్ 14 నుంచి 18 వరకు - పెర్త్ (ఉదయం 8 గంటల నుంచి)
మూడో టెస్ట్: డిసెంబర్ 26 నుంచి 30 వరకు - మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటల నుంచి)
నాలుగో టెస్ట్: జనవరి 3 నుంచి 7 వరకు - సిడ్నీ (ఉదయం 5 గంటల నుంచి)

వన్డే సిరిస్
తొలి వన్డే: జనవరి 12 - సిడ్నీ (ఉదయం 8.50 గంటలకు)
రెండో వన్డే: జనవరి 15 - అడిలైడ్ (ఉదయం 9.20 గంటలకు)
మూడో వన్డే: జనవరి 18 - మెల్‌బోర్న్ (ఉదయం 8.50 గంటలకు)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications