'బౌన్సింగ్‌లతోనే రోహిత్‌ను కట్టడి చేస్తాం', 'అవే నాకు ఇష్టం'

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాపై వ్యక్తిగత సవాళ్లు మొదలైయ్యాయి. ఆసీసీ వేదికపై రోహిత్ శర్మకి బౌన్సర్లతో సవాల్ విసురుతామని ఆ దేశ ఫాస్ట్ బౌలర్ కౌల్టర్ నైల్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని ఆడేందుకు భారత్ జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. బుధవారం బ్రిస్బేన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

రోహిత్ శర్మకి కఠిన పరీక్షలు తప్పవంటూ
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సోమవారం మాట్లాడిన కౌల్టర్ నైల్.. పేస్ బౌలింగ్‌కి ఎక్కువగా అనుకూలించే ఆ పిచ్‌పై రోహిత్ శర్మకి కఠిన పరీక్షలు తప్పవంటూ వ్యాఖ్యానించాడు. ఇటీవల ముగిసిన ఆసియా కప్, వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లో సెంచరీల మోత మోగించిన రోహిత్ శర్మ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కొత్త బంతితో మా బౌలర్లు అత్యుత్తమంగా
‘రోహిత్ శర్మ అద్భుతమైన క్రికెటర్. ప్రపంచ వ్యాప్తంగా అతనికి మంచి రికార్డులు ఉన్నాయి. గతంలో ఆస్ట్రేలియా గడ్డపైనా అతను పరుగులు సాధించాడు. కానీ.. ఇటీవల కాలంలో కొత్త బంతితో మా జట్టు బౌలర్లు అత్యుత్తమంగా రాణిస్తున్నారు. భారత్‌తో చివరిసారిగా తలపడిన మ్యాచ్‌లో రోహిత్ శర్మని యువ పేసర్ బెరెండ్రాఫ్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడనుకుంటా.

రోహిత్‌ని ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తాం.
బుధవారం నుంచి ఆరంభంకానున్న సిరీస్‌లోనూ అదే విధంగా రోహిత్‌ని ఔట్ చేసేందుకు ప్రయత్నిస్తాం. బ్రిస్బేన్ బౌండరీ లైన్స్ దూరంగా ఉంటాయి. కాబట్టి.. రోహిత్‌ను బౌన్సర్లతో సవాల్ విసురుతూ.. మ్యాచ్ ఆరంభంలోనే పెవిలియన్ బాట పట్టించేందుకు ప్రయత్నిస్తామని కౌల్టర్ నైల్ ధీమా వ్యక్తం చేశాడు.

నాకు బౌన్సీ పిచ్‌లు అంటేనే ఇష్టం
అంతకుముందు మాట్లాడిన రోహిత్ శర్మ.. కొద్ది రోజుల ముందే ఈ పిచ్‌లపై బౌన్స్‌ని గమనించేందుకు ఇక్కడికి వచ్చాం. బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలోని ఫాస్టెస్ట్ పిచ్‌లలో ఒకటి. బ్రిస్బేన్, పెర్త్‌లలో ఆడినప్పుడు మంచి బౌన్స్ లభిస్తుంది. దానిని ఎదుర్కోవడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇంటి దగ్గర ఎక్కువగా సిమెంట్ పిచ్‌ల మీదే ఎక్కువసేపు ఆడేవాళ్లం. అందుకే నాకు ఇక్కడ ఆడటమంటే చాలా ఇష్టం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications