ముగ్గురిలో ఎవరు?: ఆ ఇద్దరికే ఓపెనర్లుగా ఓటేసిన సెహ్వాగ్


హైదరాబాద్: ఆసీస్ గడ్డపై టీమిండియా మరో కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబరు 6 నుంచి ఆడిలైడ్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరిస్‌లో జట్టు మేనేజ్‌మెంట్‌కు ఓపెనింగ్ సమస్య పెద్ద తలనొప్పిగా మారింది.
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం టీమిండియా సెలక్టర్లు పృథ్వీ షా, మురళీ విజయ్, కేఎల్ రాహుల్ రూపంలో ముగ్గురు ఓపెనర్లని ఎంపిక చేశారు. అయితే, ఈ ముగ్గురితో ఏ ఇద్దరిని ఓపెనర్లుగా బరిలోకి పంపాలనే సమస్య జట్టు మేనేజ్‌మెంట్‌ని వెంటాడుతోంది. వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌తో పృథ్వీ షా అరంగేట్రం చేశాడు.

అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించిన పృథ్వీ షా
తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించిన అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆస్ట్రేలియా ఎలెవన్‌తో గురువారం ప్రారంభమైన వార్మప్ మ్యాచ్‌లో సైతం ఆశించిన స్థాయిలో రాణించలేదు.

వార్మప్ మ్యాచ్‌లో నిరాశపరిచిన కేఎల్ రాహుల్
ఈ మ్యాచ్‌లో రాహుల్ (3) ఔటై నిరాశపరిచాడు. మరోవైపు మురళీ విజయ్ ఫామ్ కూడా ఆందోళనకరంగానే ఉంది. దీంతో పృథ్వీ షాతో పాటు మరో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ లేదా మురళీ విజయ్‌లో ఎవరికి అవకాశం ఇవ్వాలి? అనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అడిలైడ్ టెస్టుకు ఓపెనర్‌గా ఎవరెవరిని ఎంపిక చేస్తారు? అని సెహ్వాగ్‌ని ప్రశ్నించగా తనదైన శైలిలో స్పందించాడు.

రాహుల్, షాలను సిరీస్ మొత్తం ఓపెనర్లుగా కొనసాగిస్తా
"ఒకవేళ నేను కెప్టెన్‌గా ఉండి ఉంటే? కేఎల్ రాహుల్, పృథ్వీ షాలను సిరీస్ మొత్తం ఓపెనర్లుగా కొనసాగిస్తా. ఎందుకంటే, మురళీ విజయ్ ఇటీవల భారత్ జట్టులోకి పునరాగమం చేశాడు. అతను ఛాన్స్ కోసం వేచి ఉండాలి. ఒకవేళ ఈ నాలుగు టెస్టుల సిరీస్‌లో ఎవరైనా విఫలమైతే? అప్పుడు మురళీ విజయ్‌కి అవకాశం ఇవ్వాలి. నా అంచనా ప్రకారం క్రికెటర్లు ఇలా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారో? వారు కచ్చితంగా ఛాన్స్ దొరికినప్పుడు అద్భుత ప్రదర్శన చేస్తారు" అని అన్నాడు.

టెస్టు జట్టు
భారత్ టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, పృథ్వీ షా, చతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, పార్థివ్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications