For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: కోహ్లీతో ఆసీస్ బౌలర్లకు చిక్కులు తప్పవన్న మాజీ ఓపెనర్

India vs Australia 2019 : Kohli Will Be Tough For The Australian Bowling Situvations
India vs Australia: Virat Kohli vs Jhye Richardson contest wont be same this time, says Matthew Hayden

హైదరాబాద్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా రెండు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. విమానాశ్రయం నుంచి రెండు బస్సుల్లో హోటల్‌కు చేరుకున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు మంగళవారం విశ్రాంతి తీసుకోనున్నారు. ఆస్ట్రేలియా జట్టు భారత్‌కు చేరుకున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో ఆస్ట్రేలియా బౌలర్లకు చిక్కులు తప్పవని ఆ దేశ మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ హెచ్చరించాడు.

హెడెన్ మాట్లాడుతూ

హెడెన్ మాట్లాడుతూ

మాథ్యూ హెడెన్ మాట్లాడుతూ ఇటీవల ఆసీస్ పర్యటనలో కోహ్లీని మూడు సార్లు ఔట్ చేసిన యువ ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌‌‌కి ఈసారి అంత సులువుగా వికెట్ దక్కబోదని మాజీ ఓపెనర్ చెప్పుకొచ్చాడు. "ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌లో రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కాస్త తడబడ్డాడు. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతుల్ని వెంటాడే ప్రయత్నంలో మూడుసార్లు వికెట్ చేజార్చుకున్నాడు. అయితే, భారత్‌లో పరిస్థితులు వేరులా ఉంటాయి. మరోవైపు రిచర్డ్‌సన్ ఇంకా యువకుడు.. అతనికి తగినంత క్రికెట్ అనుభవం లేదు" అని మాథ్యూ హెడెన్ చెప్పుకొచ్చాడు.

కోహ్లీ ఆధిపత్యం కనబరుస్తాడు

కోహ్లీ ఆధిపత్యం కనబరుస్తాడు

"విరాట్ కోహ్లీ కచ్చితంగా ఈసిరీస్‌లో పూర్తిస్థాయిలో ఆధిపత్యం కనబరుస్తాడు. ఇటీవల కోహ్లీ ఫామ్‌ను చూస్తుంటే.. రిచర్డ్‌సన్‌కే కాదు.. ఆస్ట్రేలియా బౌలర్లందరికీ చిక్కులు తప్పేలాలేవు" అని హెడెన్ పేర్కొన్నాడు. వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా ఆడనున్న చివరి సిరిస్ కావడంతో ఈ సిరిస్‌లో టీమిండియా ప్రయోగాల బాట పట్టేలా కనిపిస్తోంది.

ఫిబ్రవరి 24న విశాఖ వేదికగా తొలి టీ20

ఫిబ్రవరి 24న విశాఖ వేదికగా తొలి టీ20

ఇప్పటికే ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరిస్‌కు సెలక్టర్లు జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఫిబ్రవరి 24న విశాఖపట్నం వేదికగా జరిగే తొలి టీ20తో ఈ సిరిస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో రెండ్రోజుల ప్రాక్టీస్‌ అనంతరం 22న విశాఖపట్నం బయల్దేరుతారు. మార్చి 2న హైదరాబాద్‌లో తొలి వన్డే జరగనుంది.

Story first published: Tuesday, February 19, 2019, 14:42 [IST]
Other articles published on Feb 19, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+